నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమైన కళ్యాణ్ రామ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నిర్మాతగానూ చిత్రపరిశ్రమలో ముద్ర వేశారు. తాజాగా ఆయన సతీష్ వేగ్నేస దర్శకత్వంలో తెరకెక్కించిన 'ఎంత మంచివాడవురా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. తన తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణలతో పాటు తారక్ తో తనకున్న అనుబంధం గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తనకోసం అంబాసిడర్ కారు ఒకటి కొన్నారని.. అది ఇప్పటికీ తన దగ్గర ఉందని.. ఆ కారు ఒక సెంటిమెంట్ అని చెప్పారు.

పూజాహెగ్డే పై పిచ్చి ప్రేమ.. ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా..?

తన తండ్రి హరికృష్ణ నుండి చాలా విషయాలు నేర్చుకున్నానని.. ఒక మనిషి నచ్చకపోతే అక్కడ నుండి వెళ్లిపోతా.. కానీ పక్కకి వెళ్లి మాత్రం చెడుగా చెప్పనని తెలిపారు. తారక్, నేనూ కలిసి సినిమా చేయాలని తన తండ్రికి ఉండేదని కళ్యాణ్ రామ్ చెప్పారు. భవిష్యత్తులో తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తారక్ తో మరిన్ని సినిమాలు చేస్తానని చెప్పారు.

తారక్ ని మొదటి నుండి 'తమ్ముడు' అని పిలవనని చెప్పారు కళ్యాణ్ రామ్. తారక్ తనతో కొన్నిసార్లు తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా ఉంటాడని.. మరికొన్నిసార్లు చిన్నపిల్లాడు అయిపోతాడని.. అతడితో అన్ని ఎమోషన్స్ కలిసిపోయి ఉంటాయని చెప్పారు.

అందుకే తారక్ ని ఎప్పుడూ తమ్ముడూ అని పిలవానని.. వేదికలపై కూడా 'నాన్నా' అనే పిలుస్తానని చెప్పారు. తన తండ్రి అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన లేని లోటు తారక్ తీరుస్తున్నాడని.. ఒకరికొకరం అండగా ఉంటామని చెప్పారు.