తెదేపా కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, దగ్గుబాటి పురంధరేశ్వరి. నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు నివాళులు అర్పించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకొని పెద్ద సంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. తెదేపా కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

RRR : ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కంటెంట్, ఖర్చు!

మరోపక్క ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో ర్యాలీ ఏర్పాటు చేశారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని రసూల్‌పూర చౌరస్తా ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబునాయుడు రానున్నారని సమాచారం.