టాలీవుడ్ టాప్ స్టార్స్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం గురంచి రోజుకో సెన్సేషన్ న్యూస్ మీడియాలో వస్తూ సెన్సేషన్ అవుతోంది. తాజాగా  ఆర్ ఆర్ ఆర్ ని నిలబెట్టే రెండు ఎపిసోడ్స్ గురించిన ఇన్ఫో బయిటకు వచ్చింది. ఈ చిత్రం ఇంటర్వల్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్స్ కు  రాజమౌళి  సినిమా మొత్తంలో సగం బడ్జెట్ కేటాయిస్తున్నారట.

అందుతున్న సమాచారం మేరకు ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ లో ఎన్టీఆర్, చరణ్ లు కొమరం భీమ్.. అల్లూరి సీతారామ రాజులు ఇద్దరు కలుస్తారట. ఈ సీన్ కు లీడ్ గా పెద్ద యాక్షన్ ఎపిసోడ్ వస్తుందట. ఆ సీన్ సినిమాలో హైయిస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అవుతుందని అంటున్నారు.ఈ సీన్  విజువల్ వండర్ గా తీర్చిద్దిడానికి రాజమౌళి భారీ బడ్జెట్ కేటాయించారట.

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో మేజర్ హైలెట్ ఎపిసోడ్ ఇదే!

ఇక అలాగే క్లైమాక్స్ లో హీరోలిద్దరూ బ్రిటీష్ వారిపై ఫైట్ చేస్తారట.అది ఓ యుద్దంలా ఉంటుందిట. దాంతో క్లైమాక్స్  సన్నివేశాలలో వచ్చే  ఫైట్ సీన్స్ పై కూడా జక్కన్న ప్రత్యేక శ్రద్ద పెట్టి అత్యున్నత విలువలతో తెరకెక్కించనున్నారట. ఈ సినిమా కోసం మొత్తం 450 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఒక్క క్లైమాక్స్ కోసమే 150 కోట్లను కేటాయించినట్టుగా సమాచారం.  

రాజమౌళి సినిమాల్లో క్లైమాక్స్ కీలకం. ఈ సినిమాలో క్లైమాక్స్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుని ఒక రేంజ్ లో వుంటుందట. అందువలన ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పై ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. చరణ్ జోడీగా అలియా భట్ .. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, జులై 30వ తేదీన విడుదల చేయనున్నారు.