అప్పుడెప్పుడో  ‘బైరవ ద్వీపం’లో కథ డిమాండ్ మేరకు అందాల బాలకృష్ణ..కురూపిలా కనిపించి అభిమానులను ఆశ్యర్యపరిచాడు. ఆ తర్వాత ఏదైనా విభిన్నమైన సినిమా చేస్తే అందులో క్యారక్టర్ కోసం ఎలాంటి గెటప్ కు అయినా రెడీ అవుతూంటారు బాలయ్య. ఆయన తాజాగా  గుండుతో దర్శనమిచ్చి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ఈ ఫొటో వైరల్ అవుతోంది. గత సంవత్సరం తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ కోసం రకరకాలు గెటప్స్ వేసిన బాలయ్య.. ‘రూలర్’ సినిమాలో ఐరన్ మ్యాన్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్ కు పండగ చేసాడు.

ఈ ఫోటలో గుండు చేయించుకుని, మీసాలు పెంచి, వైట్‌ అండ్‌ వైట్‌ డ్రస్ లో  చిరు నవ్వు చిందిస్తున్నాడు. దీన్ని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించే చిత్రం కోసం ఇలా రెడీ అయ్యాడని చర్చ మొదలెట్టారు. సోషల్ మీడియాలో.. ‘పాత్ర కోసం బాలయ్య ఏదైనా చేస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనం, ఇది కదా మేం కోరుకుంది, ఈ లుక్‌లో అదరగొడుతున్నార’ని కామెంట్స్‌ పెడుతున్నారు.

రూటు మార్చిన హీరోలు.. హిట్టు కొట్టేలా ఉన్నారు!

మొదటసారి  బాలయ్య ఇలా జుత్తు లేకుండా దర్శనమివ్వడంతో అభిమానులు ఆనందం,ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. అయితే, నిజానికి ఇది బాలయ్య ఓ కార్యక్రమానికి హాజరుకాగా అక్కడ దిగిన ఫోటో. మరి ఫ్యాన్స్ అనుకుంటున్నట్లు బోయపాటి చిత్రం కోసం ఇలా తన లుక్‌ మార్చాడా, పర్శనల్ గా కొత్త లుక్‌ ప్రయత్నించారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా ఈ కొత్త లుక్‌లో బాలయ్య అందరిని ఆశ్చర్యపరుస్తు