శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: శుక్రవారం నాడు ప్రముఖ తెలుగు సినీ హీరో శ్రీ మహేష్ బాబు గారి సతీమణి శ్రీమతి నమ్రత శిరోద్కర్ గారు ఆలయమునకు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు వారు అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేశారు.

అనంతరం అక్కడ నుండి నమ్రత ఏపీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతితో భేటీ అయ్యారు. భారతి ప్రస్తుతం సాక్షి చైర్ పెర్సన్ గా పని చేస్తున్నారు. ఆమెతో భేటీ అయిన నమ్రత బుర్రిపాలెం విలేజ్ కి సంబంధించిన కొన్ని పనుల గురించి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి గ్రామం ఫౌండేషన్ కోసం పని చేయాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.

దీప్తి సునైనా ఎంత మారిపోయింది.. మరీ ఇంత హాట్ గానా!

సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో బుర్రిపాలెం విలేజ్ ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుండి ఆ విలేజ్ కి సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే ఓ స్కూల్ ని కట్టించారు. అలానే ప్రజలకు ఉపయోగపడే మరికొన్ని పనులు చేశారు. ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి భార్య భారతిని కలిసి ప్రభుత్వ సహాయం కోరారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా నమ్రత  చూసుకోనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.