బిగ్ బాస్ మొదటి సీజన్ పూర్తయిన తరువాత విన్నర్ గా గెలిచిన శివ బాలాజీ కంటెస్టంట్స్ అందరి కోసం పెద్ద పార్టీ హోస్ట్ చేశాడు. సీజన్ 2 సమయంలో షో పూర్తయిన తరువాత సామ్రాట్ తన ఇంట్లో పార్టీ హోస్ట్ చేశాడు. ఇప్పుడు సీజన్ 3 పూర్తి కావడంతో వరుణ్ సందేశ్ తన ఇంట్లో హౌస్ మేట్స్ అందరి కోసం స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశాడు.

దీనికి బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న కంటెస్టంట్స్ అందరితో పాటు కొందరు మీడియా సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ పార్టీలో రాహుల్ తో డేట్ కి వెళ్లే ప్రస్తావన పునర్నవి వద్ద తీసుకురాగా ఆమె రిజెక్ట్ చేసినట్లు టాక్. మొదట వరుణ్ సందేశ్, వితికాలు రాహుల్ వద్ద పునర్నవిని డేట్ కి తీసుకువెళ్తావా..? అని అడగగా.. దానికి రాహుల్ రెడీ అన్నట్లు సమాధానం ఇచ్చాడట.

అయితే పునర్నవి మాత్రం తను రెడీగా లేనని చెప్పిందట. దానికి కారణం తన బాయ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. పునర్నవి బిగ్ బాస్ షోలో తను ఒకరితో రిలేషన్షిప్ ఉన్నానని  చెప్పింది. నాగార్జున కూడా ఈ విషయంలో ఆమెకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అయితే జనాలు మాత్రం ఆమె కావాలనే చెప్పి ఉంటుందని, అనవసరమైన కాంట్రవర్సీల జోలికి పోకుండా ఉండడానికి ముందే బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్పి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కానీ పునర్నవి మరోసారి తన స్నేహితుల వద్ద ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. తను ప్రస్తుతం ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానని.. రాహుల్ పై తనకు అలాంటి ఉద్దేశమే లేదని.. అతడు మంచి స్నేహితులు మాత్రమేనని చెప్పిందట. పార్టీలో ఉన్న కొందరు వ్యక్తుల కారణంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

చీరలో యాంకర్ రష్మి.. హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తోంది!

గతంలో బిగ్ బాస్ షోలో ప్రేమించుకొని బయట పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్, పునర్నవి ల మధ్య ఎఫైర్ ఉన్నట్లు చూపించారు. దీంతో బయటకి వచ్చిన తరువాత వారు తమ రిలేషన్ కంటిన్యూ చేస్తారని అనుకున్నారు. కానీ పునర్నవి మాత్రం తనవైపు నుండి ఇవ్వాల్సిన క్లారిటీ మొత్తం ఇచ్చేసిందని తెలుస్తోంది!