మెగా బ్రదర్ నాగబాబు అప్పుడప్పుడూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సమకాలీన అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా నాగబాబు తన సోదరుడు పవన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కరోనా కారణంగా వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. దీనితో నిరాశలో ఉన్న అభిమానులకు నాగబాబు ఆసక్తిని పెంచే ముచ్చట్లు చెప్పుకొచ్చారు. వకీల్ సాబ్ మూవీ, క్రిష్ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రెండూ విభిన్నమైనవి. ఈ రెండు చిత్రాల కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
ఈ రేంజిలో చిరు షాక్ ఇచ్చాడేంటి
వకీల్ సాబ్ సినిమాపై పవన్ ముందు నుంచి ఆసక్తి ప్రదర్శించాడు. ఈ చిత్రం తన బాడీ లాంగ్వేజ్ సరిపోతుందని, అందుకే చేద్దామనుకుంటున్నట్లు ముందుగా పవన్ తనకే చెప్పాడని నాగబాబు అన్నారు. ఈ చిత్రం ఇప్పటికే హిందీ, తమిళ భాషల్లో వచ్చినప్పటికీ తెలుగులో మార్పులు ఉంటాయని అన్నారు.
ఇక క్రిష్ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మొఘలాయుల కాలానికి సంబంధించినది. కోహినూర్ వజ్రం చుట్టూ కథ ఉంటుందని విన్నట్లు నాగబాబు తెలిపారు. ఈ చిత్రం కోసం కూడా తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని అన్నారు.
