ప్రసుతం ఆచార్య సినిమా చేస్తూ బ్రేక్ లో ఉన్న చిరంజీవి  తన తదుపరి చిత్రాలు రెండింటిని ఫైనలైజ్ చేసి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. ఆయన నెక్ట్స్ తర్వాత చేయబోయే చిత్రాలకు క్లారిటీ వచ్చేసింది. ఆచార్య చిత్రం స్లో గా జరుగుతూండటంతో కాస్తంత ఉషారు తగ్గిన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో సిసిసి పనులతో బిజీగా ఉన్న చిరు..ఇద్దరు డైరక్టర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఆశ్చర్యకరమే అయినా ఆవశ్యనీయం. ఇది యంగ్ హీరోలు ఒక్కసారి చిరు ని చూసి నేర్చుకోవాలి అంటోంది ఇండస్ట్రీ.  ఆయన ముందు చూపుని, పాజిటివ్ ధృక్పధాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయనతో ఇంతకు ముందు పనిచేయని దర్శకులతో చిరు తదుపరి సినిమాలు చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ దర్శకులు ఎవరో గెస్ చేసారా లేకపోతే క్రిందకు కూడా ఓ లుక్కేయండి.

చిరు మొదటిగా లూసీఫర్ రీమేక్ ని ఓకే చేసారు. మళయాళంలో మోహన్ లాల్ నటించగా సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి సుజీత్ కు అప్పచెప్పినట్లు సమాచారం.  ఈ మేరకు సుజీత్ తనదైన శైలిలో లూసీఫర్ ని మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే తెలుగు నేటివిటీకి తగినట్లుగా తన బాడీ లాంగ్వేజ్ ని ప్రస్పుటించేలా ఉండాలని క్లారిటీ ఇచ్చినట్లు వినపడుతోంది. ఇప్పటికే లూసీఫర్ చిత్రం బేసిక్ లైన్ ని సుకుమార్, మరికొందరు రైటర్స్ కలిసి మార్పులు, చేర్పులు చేసారు. వాటిని కూడా సుజీత్ పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. యువి క్రియేషన్స్ వారు కో ప్రొడ్యూసర్స్ గా ఉంటారు.

మరో ప్రక్క రీసెంట్ గా వెంకీ మామ చిత్రం రూపొందించిన బాబీతో ఓ సినిమా చేయటానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే సంవత్సరం మొదలయ్యే ఈ చిత్రం స్టోరీ లైన్ విన్న చిరు...ట్రీట్మెంట్ చేసి వినిపించమన్నారట. లాక్ డౌన్ పూర్తయ్యాక  పూర్తి స్క్రిప్టు వింటానని హామీ ఇచ్చి వర్క్ మొదలెట్టమన్నారట. దాంతో బాబీ ..ఆ పని మీద ఉన్నారట. ఇక ఈ ప్రాజక్టుకు ఇంకా నిర్మాత ఎవరూ ఫైనలైజ్ కాలేదు.