Asianet News TeluguAsianet News Telugu

ఏం అల్లు అరవిందేనా...నేను చెయ్యలేనా..?

గత పది సంవత్సరాలుగా టాప్ ప్రొడ్యూసర్ గా హై సక్సెస్ ఫుల్ పిక్చర్స్ తీస్తూ,పంపిణీ చేస్తూ దూసుకుపోతున్నారు దిల్ రాజు. ఆయన చాలా తెలివైన బిజినెస్ మ్యాన్ అని, ఆయన స్ట్రాటజీలు చూసిన ఎవరైనా చెప్తారు. 

Dil Raju wants to enter OTT platform
Author
Hyderabad, First Published Feb 1, 2020, 9:38 AM IST

నిర్మాతల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. అయితే వారు చేసే బిజినెస్ ల మధ్య కూడా పోటీ నెలకొనబోతోందా అంటే అవుననే వినపడుతోంది. రీసెంట్ గా భవిష్యత్తంతా డిజిటల్ మీడియాదే అని అర్థం చేసుకున్న అల్లు అరవింద్... ‘నెట్ ఫ్లిక్స్’, ‘అమేజాన్ ప్రైమ్’ తరహాలో సొంతంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టారు. తన బ్యానర్ లో వచ్చిన సొంత సినిమాలకు తోడు వేరే నిర్మాతల చిత్రాలూ కొనేసి లాంచ్ చేసేసారు. దాంతో ఈ ఫ్లాట్ ఫామ్ జనాలకు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేసింది. అది క్లిక్ అయ్యిందో లేదో తేలకుండానే తను కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి రావాలని డిసైడ్ అయ్యారట దిల్ రాజు.

గత పది సంవత్సరాలుగా టాప్ ప్రొడ్యూసర్ గా హై సక్సెస్ ఫుల్ పిక్చర్స్ తీస్తూ,పంపిణీ చేస్తూ దూసుకుపోతున్నారు దిల్ రాజు. ఆయన చాలా తెలివైన బిజినెస్ మ్యాన్ అని, ఆయన స్ట్రాటజీలు చూసిన ఎవరైనా చెప్తారు. అల్లు అరవింద్ తర్వాత ఆ స్దాయిలో ఇండస్ట్రీని ఏలుతున్నది ఖచ్చితంగా దిల్ రాజే అనే మాటలో సందేహం లేదు. దాంతో ఇప్పుడు ఆయన తమ బ్యానర్ లో వచ్చిన సినిమాలు వేరే వారికి ఇవ్వటం ఎందుకు స్వయంగా డిజిటిల్ ప్లాట్ ఫామ్ పెట్టుకుంటే పోతుంది కదా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

పవన్ తరువాత మరొక మెగా హీరోతో క్రిష్ న్యూ మూవీ?

ఆ మేరకు తన టీమ్ తో చర్చ చేసి సొంత ఓటీటి ప్లాట్ ఫామ్ పెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే దాని పేరు ఏమిటి...ఎంత రేటు పెట్టనున్నారు. దిల్ రాజు బిజినెస్ స్ట్రాటజీ ఏమిటి అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. వీళ్లిద్దరు పెట్టాక మరి సురేష్ బాబు సైతం ఈ ఫీల్డ్ లోకి రాకుండా ఉంటారా..వేచి చూడాలి.

ఇక ఆహా విషయానికి వస్తే.. మై హోం సంస్థ భాగస్వామ్యంతో అల్లు అరవింద్‌‌తో దీన్ని నెలకొల్పారు. ఈ ఫ్లాట్ ఫామ్ లో ఎక్కువగా మెగా హీరోల సినిమాలే ఉండటం విశేషం.ఇప్పటికే ప్లే స్టోర్‌లో యాప్ పెట్టారు. ఏడాదికి 369 రూపాయలు, మూడు నెలలకు 149 రూపాయల చొప్పున సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు పెట్టారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios