యంగ్ హీరో నాగశౌర్య తన లవర్ బాయ్ ఇమేజ్ ని పక్కన పెట్టి యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ 'అశ్వథ్థామ' అనే సినిమాతో శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి కథ కూడా నాగశౌర్యే రాయడం విశేషం.

యువ దర్శకుడు రమణతేజ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ ఆసక్తిని పెంచాయి. తాజాగా సినిమా ఎలా ఉందనే విషయాన్ని ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

నాగశౌర్య 'అశ్వథ్థామ' ప్రీమియర్ షో టాక్!

హీరోగా నాగశౌర్య కెరీర్ లో ఈ సినిమా గుర్తుండిపోతుందని.. అతడి మాస్ లుక్ మెప్పించిందని అంటున్నారు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ ఎంతో సస్పెన్స్ గా సాగిందని.. సిస్టర్ సెంటిమెంట్ ఎమోషనల్ గా ఉంటుందంటున్నారు.

విలన్ క్యారెక్టరైజేషన్ బాగా పండిందని, పోస్ట్ ఇంట్రవల్‌లో విలన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలు థ్రిల్లింగ్ ఉంటాయని చెబుతున్నారు. క్లైమాక్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని.. సాంగ్స్ కూడా మైనస్ అని అంటున్నారు.