యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం అశ్వథ్థామ. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రమణ తేజ దర్శకుడు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఇప్పటికి చాలానే వచ్చాయి. కానీ కొత్త పాయింట్, ఉత్కంఠ భరిత సన్నివేశాలు ఉంటే ఈ జోనర్ లో ఎన్ని చిత్రాలు వచ్చినా విజయం సాధిస్తాయి. ఇప్పటి వరకు రొమాంటిక్ కామెడీ, ప్రేమ కథా చిత్రాలు చేసిన శౌర్య తొలిసారి ప్రయోగం చేస్తున్నాడు. 

అశ్వథ్థామ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. యుఎస్ ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రాన్ని వస్తున్న స్పందన, విశేషాలు తెలుసుకుందాం. దర్శకుడు రమణ తేజ ఈ చిత్రాన్ని సిస్టర్ సెంటిమెంట్, సైకో క్రైమ్ అంశాలతో రూపొందించారు. 

మెహ్రీన్ నాగశౌర్య సరసన హీరోయిన్ గా నటించింది. అమ్మాయిల మిస్సింగ్, ఆ తర్వాత వారు సూసైడ్ చేసుకుని కనిపించడం లాంటి సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచే విధంగా ఉంటాయి. హీరో క్రమంగా మిస్సింగ్ కేసులపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభింస్తాడు. ఇంటర్వెల్ సమయానికి ఈ కేసులపై హీరోకు ఓ క్లూ దొరుకుతుంది. 

ఆశలన్నీ 'అశ్వద్ధామ' పైనే.. సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అయ్యేనా?

నాగశౌర్య పెర్ఫామెన్స్, ఆసక్తిని కలిగించే సీన్స్ తో ఫస్ట్ హాఫ్ మరీ గొప్పగా కాకున్నా పరవాలేదనిపించే విధంగా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత అసలు విలన్ ఎవరనేది రివీల్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో విలన్ ని సైకో తరహాలో భయకంరంగా చూపిస్తారు. పోలీసులతో కలసి విలన్ కోసం నాగశౌర్య ఇన్వెస్టిగేషన్ చేసే సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బావుంటాయి. 

కానీ ఈ చిత్రంలో దర్శకత్వ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. సిస్టర్ సెంటిమెంట్, క్రైమ్ కథని కలిపి చెప్పడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వస్తోంది. కథ బావున్నప్పటికీ స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతుంది. ఓవరాల్ గా  అశ్వథ్థామ చిత్రంలో నాగశౌర్య నటన, యాక్షన్ ఎపిసోడ్స్ మెప్పించే విధంగా ఉంటాయి.