యువ హీరో నాగశౌర్య నుంచి రాబోతున్న ఆసక్తికర చిత్రం అశ్వథ్థామ. రమణ తేజ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర టైటిల్ ప్రకటించినప్పటి నుంచి సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింతగా ఆసక్తిని రేకెత్తించింది. 

తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయింది. 'రాక్షసుడిని, భగవంతుడిని చూసిన కళ్ళు ఇక ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతాయి' అంటూ బ్యాగ్రౌండ్ లో వినిపించే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. 

సముద్ర తీరప్రాంతంలో అమ్మాయిల అక్రమ రవాణా, హత్యలు అనే క్రైం అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. అనుకోకుండా యువతకు మిస్ కావడం, ఆ తర్వాత మరణించడం లాంటి అంశాలు కథలో డెప్త్ ని తెలియజేస్తున్నాయి. 'ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు.. వేట కుక్కలా వెంటాడే జాలర్లు.. శకుని లాంటి ఒక ముసలోడు.. వీరందరిని ఒకే స్టేజిపై నడిపిస్తున్న ఆ సూద్రధారి ఎవరు' అంటూ నాగ శౌర్య చెబుతున్న డైలాగ్ బావుంది. 

పవన్ కళ్యాణ్ మాటలకు గూస్ బంప్స్.. తమన్ కామెంట్స్

విలన్ కోసం నాగ శౌర్య ఎంతలా అన్వేషిస్తున్నాడో ట్రైలర్ లో చూపించారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో నాగ శౌర్య అదరగొట్టేశాడు. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్, ఎమోషన్, ఉత్కంఠ కలగలిపి మైండ్ గేమ్ తరహాలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. నాగ శౌర్యకు జోడిగా ఈ చిత్రంలో మెహ్రీన్ నటించింది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. గిబ్రాన్ బ్యాగ్రౌండ్ సంగీతం అందించాడు. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.