టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత వచ్చిన మల్టీస్టారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వెంకిమామ. వెంకటేష్ - నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ పాజిటివ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటిరోజే ఈ సినిమా సాలిడ్ గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.

వెంకటేష్ - నాగ చైతన్యలకు ఇదే హైయ్యెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం.  శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకిమామ మొదటి వారం మంచి షేర్స్ ని రాబట్టింది. మొత్తంగా ఆదివారానికి 17.78కోట్ల షేర్స్ అందినట్లు టాక్. గ్రాస్ కలెక్షన్స్ 40కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ రిజల్ట్ పై అఫీషియల్ ఎనౌన్న్మెంట్ వెలువడాల్సి ఉంది.

హీరోల రేంజ్ లో విలన్స్ జీతాలు.. పని తక్కువైనా ఆదాయం ఎక్కువే

ఇకపోతే అసలైన గండం ఈ సినిమాకు ఈ రోజు నుంచే మొదలవ్వనుంది.  సోమవారం సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం క్లిక్కయినా సినిమా లాభాల్లోకి వచ్చినట్లు లెక్క. వీకెండ్స్ లో ఎలాగు మంచి కలెక్షన్స్ వస్తాయి. సోమవారం నుంచి గనక ఇదే ఫ్లో కొనసాగితే ప్రాఫిట్ జోన్ లోకి వస్తుంది. ఇక యూఎస్ లో సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.

రివ్యూలు నెగిటివ్ గా వచ్చినప్పటికీ వెంకిమామ ఫస్ట్ వీక్ ని విజయవంతగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం వెంకిమామకి పోటీని ఇచ్చే సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. మరి సినిమా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు.