వరుస డిజాస్టర్ అనంతరం మజిలీ సినిమాతో సక్సెస్ అందుకున్న అక్కినేని హీరో నాగ చైతన్య నెక్స్ట్ మరో రెండు డిఫరెంట్ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ నెల 23న పుట్టినరోజు సందర్బంగా తన కొత్త సినిమాలకు సంబందించిన స్పెషల్ అప్డేట్స్ తో చైతు అభిమానులకు  సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు.

మామ వెంకటేష్ తో వెంకిమామ సినిమా చేస్తున్న చైతు సినిమాకు సంబందించిన రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆ సినిమాలో పాత్రకు సంబందించిన టీజర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ  చేస్తోన్న మరో డిఫరెంట్ లవ్ స్టోరీ సినిమా అప్డేట్ కూడా ఆ డే రోజు రానుంది.

ఆ ప్రాజెక్ట్ లో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు సంబందించిన చైతు లుక్ ఒకటి ఇప్పుడు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.  చైతూకి ఇది 19వ సినిమా. తన పుట్టినరోజు సందర్బంగా సినిమాలో పాత్ర యొక్క టీజర్ ని అభిమానులకు చూపించబోతున్నాడు. చిత్ర యూనిట్ లవర్స్ డే ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం సినిమాను లాంచ్ చేసిన చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లో షూటింగ్ స్పీడ్ పెంచనుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి ఎండింగ్ కల్లా పూర్తి చేయాలనీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

టైటానిక్ హీరోని కదిలించిన ఢిల్లీవాసుల ఆవేదన..!

ఫిదా తరహాలోనే దర్శకుడు మళ్ళీస్క్రీన్ పై మ్యాజిక్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది.  ఫైనల్ గా సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనీ ఇటీవల చిత్ర యూనిట్ నిర్వహణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగ చైతన్య వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. డిసెంబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. బాబీ తెరకెక్కిస్తున్న వెంకీ మామ సినిమాని సురేష్ బాబు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.