టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వారసుడిగా తెలుగు పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ప్రారంభంలో చెప్పుకోదగ్గ హిట్స్ పడలేదు. అయితే ఆ తరువాత మెల్లిగా తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ సినిమాలు చేస్తూ క్రేజ్, పేరును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా వివాహం అనంతరం చేసిన మజిలీ, వెంకీ మామ సినిమాలతో చైతు కెరీర్ పరంగా ఒడ్డున పడ్డాడు. ఆ ఊపులో ప్రస్తుతం చైతు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చైతు గీత గోవిందం దర్శకుడితో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన సైతం వచ్చింది.

2018లో గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్. విడుదలై దాదాపు ఏడాదిన్నర అయినా తన కొత్త సినిమా మొదలెట్టలేదు. మహేష్ తో చేస్తాడనుకునుంటే ...నాగచైతన్య 20వ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కించనున్నాడంటూ ప్రకటన వచ్చింది.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబదించిన స్క్రిప్ట్ పని పూర్తి అయినట్లు సమాచారం. ఈ సినిమా కూడా గీతా గోవిందం తరహాలో రొమాంటిక్ ఎంటర్ టైన్ గా తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ఇంట్రెస్టింగ్: 'బ్యాచ్‌లర్' కథలతో రాబోతున్న కుర్ర హీరోలు

అలాగే ఈ సినిమా కోసం టైటిల్ ని సైతం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. చైతూ తాత నాగేశ్వర రావు పేరును టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అలాగే మనం సినిమాలో నాగేశ్వర్ గా అదరగొట్టిన చైతు.. ఇప్పడు పరుశరాం దర్శకత్వంలోని సినిమాకు అదే పేరును టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

 ఈ సినిమా షూటింగ్ సమ్మర్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో చై సరసన ఎవరు నటించనున్నారు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక ను అడిగారని, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని సమాచారం.