టాలీవుడ్ లోకాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కాస్టింగ్ కౌచ్ పోరాటంలో భాగంగా శ్రీరెడ్డి అర్థనగ్న నిరసనకు కూడా వెనుకాడలేదు. దీనితో శ్రీరెడ్డి ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు అప్పట్లో ప్రకంపనలు సృష్టించాయి. 

తాజాగా తమిళంలో శ్రీరెడ్డి తరహాలో ఓ ఎపిసోడ్ ప్రారంభం అయింది. డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గర్ ఫోజులు, టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో ఎలాకియా అనే భామ క్రేజ్ తెచ్చుకుంది. ఎలాకియా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ తమిళ దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

'నీ ఎంకమ్మ.. అంత సీన్ ఉంటే నాకు కరోనా తెప్పించు'.. కేఏ పాల్ పై వర్మ సెటైర్లు

ఎలాకియా కొన్ని తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఎలాకియా మాట్లాడుతూ కొంతమంది దర్శకులు తనకి అవకాశాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించింది. తమతో శృంగారం చేస్తే అవకాశాలు ఇస్తామని మాట ఇవ్వడంతో తాను నమ్మి మోసపోయానని ఎలాకియా పేర్కొంది. 

మోహన్ బాబు బర్త్ డే: వైరల్ అవుతున్న మనోజ్ పోస్ట్.. చిరంజీవి సెటైర్

ఇండస్ట్రీకి వచ్చే కొత్త అమ్మాయిలు ఎవరూ తనలా మోసపోవద్దని కోరింది. ఇక ఎలాకియా పై కూడా అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. వల్గర్ ఫోజులు, డబుల్ మీనింగ్ డైలాగులతో సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తిస్తోంది అంటూ కొందరు విమర్శిస్తున్నారు.