ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్ క్రేజ్ మాములుగా లేదు. అతడి చేతుల్లో చాలా సినిమాలు ఉన్నాయి. వచ్చే వారం విడుదల కాబోయే 'వెంకీ మామ'కి మ్యూజిక్ అందించింది తమనే.. ఆ తరువాతి వారం క్రిస్మస్ కానుకగా రాబోతున్న 'ప్రతిరోజూ పండగే' కూడా తమన్ సినిమానే.

ఆ తరువాత సంక్రాంతికి రాబోయే క్రేజీ ప్రాజెక్ట్ 'అల.. వైకుంఠపురములో' సైతం తమన్ స్వరాలు సమకూర్చిన చిత్రమే.. ఇంకా అతడి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. రవితేజ 'డిస్కో రాజా'కి కూడా తమన్ మ్యూజిక్ అందించారు. రవితేజ తర్వాతి సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ అందించబోతున్నాడని సమాచారం.

యాక్టింగ్ కోసం సెక్స్ వదలను.. కుర్ర హీరో హాట్ కామెంట్స్!

ఇప్పుడు టాలీవుడ్ లో భారీ బడ్జెట్, మీడియం బడ్జెట్ సినిమాలు తీసే మేకర్స్ తమన్ వైపే చూసే పరిస్థితి కలుగుతోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాకి కూడా తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేసుకున్నారు. సాధారణంగా అయితే బోయపాటి తన సినిమాలకు దేవిశ్రీప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటూ ఉంటాడు.

చాలా సినిమాలకు అతడితోనే సంగీతం చేయించుకున్నారు. ఒక్క 'సరైనోడు' సినిమాకి మాత్రం తమన్ ని పెట్టుకున్నారు. ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ అయినప్పటికీ బోయపాటి మాత్రం తమన్ ని కంటిన్యూ చేయలేదు. ఎప్పటిలానే దేవిశ్రీతో సంగీతం చేయించుకున్నాడు. కానీ బాలయ్య కొత్త సినిమా కోసం మాత్రం తమన్ ని ఎన్నుకున్నారు.

మరోవైపు మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ కూడా దేవి చేయాల్సింది కానీ తమన్ కి ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి తమన్ ఇండస్ట్రీలో అవకాశాలన్నీ తన్నుకుపోతున్నాడనే చెప్పాలి.