బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ బాగా ఫేమస్ అయిపోతున్నాడు. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. బాలీవుడ్ లో కొందరు హీరోయిన్లకు కూడా కార్తిక్ ఆర్యన్ అంటే చాలా ఇష్టం.

స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఓ టాక్ షోలో కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ చేయాలనుందని నేరుగా చెప్పేసింది. దీన్ని బట్టి అతడికి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. దర్శకనిర్మాతలు కూడా అతడితో సినిమాలు చేయడానికి క్యూలో నిలబడుతున్నారు.

కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించిన 'పతి పత్ని ఔర్ వో' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ షోలో పాల్గొన్న కార్తిక్ ఆర్యన్ కి ఓ ప్రశ్న ఎదురైంది.

టోటల్ సినిమానే ఏకిపారేసిన ట్రోలర్స్.. తలలు పట్టుకున్న హీరోలు!

'లైఫ్ లో సెక్స్, యాక్టింగ్ ఈ రెండింటిలో ఏదైనా వదులుకోవాల్సి వస్తే దేన్ని వదులుకుంటారు' అని ప్రశ్నించగా.. దానికి కార్తిక్ ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు. తనకు లైఫ్ లో యాక్టింగ్, సెక్స్ రెండూ కావాలని.. సెక్స్ కోసం యాక్టింగ్, యాక్టింగ్ కోసం సెక్స్ వదులుకోనని చెప్పారు. సెక్స్, యాక్టింగ్ తనకు బ్రెడ్, బటర్ తో సమానమని అన్నారు. తన వ్యతిగత జీవితం గురించి బయట మాట్లాడడానికి ఇష్టపడనని చెప్పిన కార్తిక్ అలా అని దాచకుండా ఉంచలేనని చెప్పారు.

బయట ఫోటోగ్రాఫర్లు ఉంటారు కదా అని తనకు నచ్చిన వారితో రెస్టారంట్ కి వెళ్లకుండా ఉండలేనని చెప్పారు. ఇప్పటివరకు కార్తిక్ కి బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లతో లింక్స్ పెడుతూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడు సారా అలీ ఖాన్ తో ప్రేమలో ఉన్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో పక్క అనన్య పాండేతో కూడా సన్నిహితంగా మెలుగుతున్నాడని అంటున్నారు. ఈ వార్తలపై స్పందించిన కార్తిక్ ఆర్యన్ అలాంటి వార్తలు రాయకపోతే బాధపడాలి అంటూ వెటకారంగా అన్నాడు.