శత్రువు, దేవి, దేవీపుత్రుడు, ఒక్కడు,వర్షం,నువ్వొస్తానంటే నేనొద్దంటానా..ఇలా ఏ సినిమా పట్టుకున్నా అందులో ఓ మ్యాజిక్, చక్కటి మ్యూజిక్ ఉండేది. ఆ సినిమాలు చూస్తే ఆయన టేస్ట్ ఏంటో చెప్పేయవచ్చు. అది ఏ స్దాయికి వెళ్లిందంటే...హీరోల్ని,డైరక్టర్స్ ని  చూసి.. సినిమాలకు వెళ్లినట్లే.. నిర్మాతని చూసి కూడా సినిమాలకు వెళ్లడం అన్నది ఎమ్మెస్ రాజు విషయంలో జరిగింది. అలాంటి ఎమ్ ఎస్ రాజు తాజాగా ఓ చిత్రం డైరక్ట్ చేస్తూ పోస్టర్ విడుదల చేసారు. దాన్ని చూసిన అందరూ షాక్ అవుతున్నారు. ఆయన టేస్ట్ ఏమిటి ...ఇలా బూతుగా మారిపోయింది అంటున్నారు.

'గూఢచారి' హీరోయిన్ గర్భవతి.. ఫోటో వైరల్!

దాదాపు 12ఏళ్ల తరువాత ఎమ్ ఎస్ రాజు మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు. డర్టీ హరి అనే టైటిల్ తో ఒక  మూవీకి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ రోజు ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా చూడటానికి చాలా బోల్డ్ గా ఇంట్రస్టింగ్ గా ఉంది. బాత్ టబ్ లో అబ్బాయి నోట్లో ఓ అమ్మాయి కాలితో సిగరెట్ పెడుతున్న ఆ పోస్టర్ చూస్తుంటే మూవీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.

వరస సినిమాల ఫెయిల్యూర్ తో విసుగెత్తిన రాజుగారు... ఈ సినిమాని బి,సి సెంటర్లలోని ఓ వర్గం కుర్రాళ్ల  కోసం తీస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యం ఇంకా తెలియరాలదు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తున్నారు. ఈ చిత్రం అందంగా మరియు పొయిటిక్ గా యువ ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుంద‌ని ఎంఎస్ రాజు వెల్లడించారు. గూడూరి శివ‌రామకృష్ణ‌, గూడురు స‌తీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్‌పీజే క్రియేష‌న్స్ బేన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.