హైదరాబాద్: అమ్ములు పేరు ప్రతి తెలుగు ఇంటిలో మారుమోగుతోంది. మౌనరాగం సీరియల్ ద్వారా అమ్ములు తెలుగు ప్రజల గుండెల్లో చోటు దక్కించుకున్నారు. మా స్టార్ లో ప్రసారమవుతున్న డైలీ సీరియల్ మౌనరాగంలో అమ్ములు పాత్ర విశేషంగా జనాదరణ పొందింది. 

సీరియల్ లో ఎక్కడా అమ్ములు మాట్లాడదు. అంతా కళ్లతో, హావభావాలతో మాట్లాడుతుంది. మాటల్లేకుండా కళ్లతో, ముఖ కవళికలతో నటనను పండించడం అంత సులభమేమీ కాదు. కానీ అమ్ములు ఆ పనిచేస్తోంది. అమ్ములు అసలు పేరు ప్రియాంక జైన్. 

కార్తీకదీపం(నవంబర్22) మా నాన్న మీరే అని ఎందుకు చెప్పలేదు.. కార్తీక్ ని నిలదీసిన శౌర్య

ఆడపిల్లలు ఇష్టం లేని సీనయ్య భార్యకు పాయిజన్ ఇవ్వడంతో అమ్ములు మూగగా పుడుతుంది. అదే సీరియల్ ముఖ్యమైన పాత్ర. అ పాత్ర చుట్టే అన్ని పాత్రలూ తిరుగుతుంటాయి. అమ్ములు పాత్ర పోషించిన ప్రియాంక జైన్ ఇంట్లో ఎవరూ నటులు లేరు. కానీ, తల్లికి నటి అవ్వాలనే కోరిక ఉండేదట. అయితే, ఆమె కల నెరవేరకపోవడంతో ప్రియాంక జైన్ ను నటిగా చూడాలని కలలు కని దాన్ని నిజం చేసుకుంది.

ప్రియాంక జైన్ ది 18 ఏళ్ల వయస్సు. పుట్టింది మహారాష్ట్రలో. ఆ తర్వాత బెంగళూరుకు కుటుంబం మకాం మార్చింది. సీరియల్ లో మాట్లాడదు గానీ బయట దడదడలాడిస్తుంది. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి ఆమె చెప్పుకుంది.

ప్రియాంక జైన్ తెలుగులో కూడా మాట్లాడేస్తుంది. మౌనరాగం సీరియల్ లో నటించడానికి ముందు ఆమె కన్నడంలో ఓ సినిమా చేసింది. తమిళ రీమేక్ గోలి సోడా ఆ సినిమా. తెలుగులో చల్తే చల్తే, వినరా సోదర వీర కుమారా వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మౌనరాగం సీరియల్ లో నటించడానికి ఆమెకు అవకాశం వచ్చింది. 

తెలుగు సినిమాల్లో నటించాల్సి వస్తే... నాగార్జునతో నటించాలని ఉన్నట్లు ఆమె తెలిపింది. నాగార్జున అంటే తెగ ఇష్టమని చెప్పింది. అందుకే నాగార్జున సినిమాలో చిన్న రోల్ వచ్చినా చేస్తానని అంటోంది.