బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టీవీ సీరియల్ కార్తీక దీపం. కొత్త కొత్త మలుపులతో... ఊహించని ట్విస్ట్ లతో ఈ సీరియల్ అలరిస్తోంది. అందుకే... తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సీరియల్ కి నీరాజనాలు పడుతున్నారు. రోజు టీవీలో టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ మీ కోసం ముందుగానే...

గత ఎపిసోడ్ లో... శౌర్యకి తన తండ్రే కార్తీక్ అనే నిజం తెలిసిపోతుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ ఓ గుడికి వెళ్తుంది. మరోవైపు కార్తీక్ మాటలతో బాధపడుతూ దీప.. ధీనంగా నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఆమెకు తన అంతరాత్మ కనపడుతుంది. తన కూతురికి తండ్రి ఎవరో చెబుతాను.. తన పవిత్రతను నిరూపించుకుంటానని శపథం చేస్తుంది. ఆ సమయంలోనే వారణాసి ఫోన్ చేసి శౌర్య కనిపించడం లేదని చెబుతాడు.

alsoRead కార్తీక దీపం(నవంబర్ 21): నిజం తెలుసుకున్న శౌర్య... దీప సంచలన నిర్ణయం...

నేటి ఎపిసోడ్ లో... వారణాసి ఫోన్ తో దీపలో కంగారు మొదలౌతుంది. తండ్రి కోసం వెదకడానికి ఎక్కడికి వెళ్లిందో అని కంగారుపడుతుంది. నీ తండ్రి నీకు ఎప్పటికీ రాడని ఎలా చెప్పను అంటూ ఏడుస్తుంది.. తన గుండెలాగే తన కూతురు గుండె కూడా రాయిలాగా ఎలా మార్చాలి అంటూ రోదిస్తుంది. ఇదిలా ఉంటే.... దీప వెళ్లిన తరర్వాత జరిగిన సంఘటనను తలుచుకొని సౌందర్య, ఆనందరావులు బాధపడుతుంటారు. ఇంటికి ఏదో దోషం ఉందని.. శాంతి  చేయిస్తే బాగుంటుందని సౌందర్య భావిస్తుంది.

తల్లి మాటలకు ఆదిత్యకు కోపం బాగా వస్తుంది. శాంతి చేయించాల్సింది ఇంటికి కాదని.. తన సోదరుడు కార్తీక్ బుర్రకి అంటూ ఆవేశపడిపోతాడు. ఇక నుంచి కార్తీక్ ని సుపుత్రుడు, దేశోదారకుడు అంటూ తల్లిని పిలవద్దని హెచ్చరిస్తాడు. కట్టుకున్న భార్యను అనుమానించాడని... చిన్నపిల్ల శౌర్య పుట్టుకను కూడా కార్తీక్ హేలన చేస్తున్నాడని ఆదిత్య మండిపడతాడు. అతనికి తల్లి సౌందర్య, ఆనందరావులు నచ్చచెబుతారు.

ఇదిలా ఉండగా..మోనిత.. కార్తీక్ తో మాట్లాడుతూ ఉంటుంది. శౌర్యను నీ కూతురు చేసేదాక ఆ దీప  నిద్రపోదు అంటూ కార్తీక్ ని రెచ్చగొట్ట్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో  కూతురు కనిపించడం లేదంటూ... దీప.. హాస్పిటల్ లో ఉన్న కార్తీక్ దగ్గరకు వెళ్తుంది. శౌర్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రమ్మని కోరుతుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న  మోనిత.. ఇద్దరి మధ్య పుల్లలుపెట్టే ప్రయత్నం చేస్తుంది. 

కార్తీక్, దీపలను రెచ్చగొట్టేలా మోనిత మాట్లాడుతుంది. మోనిత మాటలకు దీప కూడా అదే రేంజ్ లో సమాధానం ఇస్తుంది. వారిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరిపోవడంతో.. కార్తీక్ ఇద్దరిని తిడతాడు. దీంతో... మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత దీప.. కార్తీక్ ని బతిమిలాడుతుంది. అయినా కార్తీక్ వినిపించుకోకపోవడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

దీప మాటల గురించి.. శౌర్య కనిపించడం లేదనే ఆలోచనలతో కారు కూడా ఎక్కడం మర్చిపోయి కార్తీక్ నడుచుకుంటూ వెళ్లిపోతాడు. ఎదురుగా శౌర్య కూడా నడుచుకుంటూ వస్తుంది. ఆ సమయంలో శౌర్యకు కార్తీక్ కనపడతాడు. వెంటనే డాక్టర్ బాబు అని పిలవబోయి.. కాదు.. నాన్న అంటూ పరుగులు తీస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో.... మీరే మా నాన్న అని ఎందుకు చెప్పలేదు..? నేనే ఏం తప్పు చేశాను..? ఛెప్పు నాన్న అంటూ శౌర్య కార్తీక్ ని నిలదీస్తుంది. ఆ మాటలకు కోపంతో  ఊగిపోయిన కార్తీక్.. నేను నీ తండ్రిని కాదు పోమ్మంటాడు. నిజంగానే శౌర్య.. కార్తీక్ ని నాన్న అనిపిలుస్తుందా..? లేదా అలా పిలిస్తే ఏం  జరుగుతుందో ముందే ఊహించుకుంటుందో రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.