టీవీ నటి మోనా సింగ్ శుక్రవారం నాడు ప్రేమ వివాహం చేసుకున్నారు. తన చిరకాల స్నేహితుడు శ్యామ్ ని ఆమె వివాహం చేసుకున్నారు. ఇందులో భాగంగా గురువారం జరిగిన మోనా సింగ్ మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

మోనా స్నేహితులు గౌరవ్ గేరా, ఆశిష్ కపూర్ ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన వీడియోలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. తన  భర్తతో ఫోటోలకు ఫోజిచ్చిన మోనా సింగ్ కి అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీవీ నటిగా కెరీర్ ఆరంభించిన మోనా సింగ్(38).. కొన్ని చిత్రాల్లో కూడా నటించారు.

దేవిశ్రీ ఫ్యామిలీ నుండి మరో రాక్ స్టార్.. డ్రమ్స్ పగిలిపోవాల్సిందే!

'త్రీ ఇడియట్స్' సినిమాలో హీరోయిన్ అక్క పాత్రలో కనిపించి మెప్పించారు. బుల్లితెర, వెండితెరతో పాటు నాటకరంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. గత కొంతకాలంగా సౌత్ కి చెందిన బ్యాంకర్ శ్యామ్ తో ప్రేమాయణం సాగిస్తోన్న ఈమె డిసెంబర్ 27న అతడిని పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

కొద్దిమంది స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి తరువాత కూడా ఆమె నటిగా కెరీర్ ని కొనసాగించనున్నారు. ప్రస్తుతం ఈమె ఆమిర్ ఖార్, కరీనా కపూర్ నటిస్తోన్న 'లాల్ సింగ్ చద్దా' అనే సినిమాలో నటిస్తోంది.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Mona ki Mehndi 🥰 #monakishadi

A post shared by Gaurav gera (@gauravgera) on Dec 26, 2019 at 12:27am PST