టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దేవిశ్రీప్రసాద్ తన సంగీతంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన ఆయన ఇప్పటికే తొమ్మిది ఫిలిం ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం దేవి.. మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదలయ్యాయి. వీటిలో 'సరిలేరు నీకెవ్వరు ఆంథమ్' కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

టీవీ షోలో వెక్కి వెక్కి ఏడ్చేసిన స్టార్ హీరోయిన్!

ఈ పాటను దేవిశ్రీప్రసాద్ మేనల్లుడు తనవ్ సత్య పాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటి నుండి తన మేనల్లుడికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉండే దేవి తాజాగా మరో స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు.

ఇందులో తనవ్ సత్య 'సరిలేరు నీకెవ్వరు' అంటూ ఎంతో ముద్దుగా పాడుతున్నాడు. అంతేకాదు.. తన పాటకి అనుగుణంగా వాషింగ్ మెషీన్ పై కొడుతూ మెప్పించాడు. తనవ్ సత్య ఈ పాటని తనకు తానుగా నేర్చుకొని సర్ప్రైజ్ చేసినట్లు దేవి తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక ఈ పాటని హిట్ చేసిన ప్రేక్షకులకి స్పెషల్ థాంక్స్ చెప్పాడు దేవి.