మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడలింగ్ లో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఐశ్వర్య రాయి నటిగా కూడా తిరుగులేని ఖ్యాతి గడించింది. నటన, డాన్సుల్లో స్టార్ హీరోలకు సైతం ఐశ్వర్య రాయి పోటీగా నిలిచింది. 

అభిషేక్ బచ్చన్ తో వివాహం తర్వాత ఐశ్వర్యరాయి వెండితెరపై జోరు తగ్గించింది. ఐశ్వర్యారాయ్ ని అందాల దేవతలా ఆరాధించే అభిమానులు ఉన్నారు. ఐశ్వర్యరాయ్ కి సంబంధించిన ఫోటో ఏదైనా అభిమానులకు అపురూపమే. తాజాగా ఐశ్వర్యారాయ్ ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్నప్పటి ఫోటో ఒకటి అవుతోంది. 

స్టార్ క్రికెటర్ కూతురితో నటుడి డేటింగ్.. లాక్ డౌన్ లో ఇరుక్కున్నారు

ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న తర్వాత ఐశ్వర్యారాయ్ తన తల్లి బ్రింద్యరాయ్ తో కలసి భోజనం చేస్తున్న పిక్ నెటిజన్లని ఆకట్టుకుంటోంది. తలపై ప్రపంచ సుందరి కిరీటం, పిక్ సారీ ధరించిన ఐశ్వర్యరాయి నేలపై కూర్చుకుని భోజనం చేస్తోంది. 

ఇక సినిమాల విషయానికి వస్తే ఐశ్వర్యారాయ్ త్వరలో మణిరత్నం తెరకెక్కించే పొన్నియన్ సెల్వం చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం.