బాలీవుడ్ లో డేటింగ్ వ్యవహారాలు బోలెడన్ని ఉన్నాయి. ఇంకా ఇండస్ట్రీకి కూడా పరిచయం కానీ కుర్రాళ్ళ నుంచి ఐదు పదుల వయసున్న వారి వరకు చాలానే ప్రేమ వ్యవహారాలు సాగుతున్నాయి. కరోనా ప్రభావంతో ప్రపంచం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ వల్ల ప్రేమ జంటలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

దిగ్గజ క్రికెటర్ విప్ రిచర్డ్స్, బాలీవుడ్ నటి నీనా గుప్తల ముద్దుల కుమార్తె మసాబా గుప్త ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తోంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాతో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. 

లాక్ డౌన్ ముందు ఈ జంట గోవా ట్రిప్ కు వెళ్లారు. వెంటనే లాక్ డౌన్ అమలు కావడంతో ప్రస్తుతం సత్యదీప్, మసాబా ఇద్దరూ గోవాలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 

హీరోయిన్ అతిథిరావు హైదరి, సత్యదీప్ మిశ్రా 2013లో విడిపోయారు. ఇక మసాబా గుప్తకు కూడా ఆల్రెడీ పెళ్లయింది. 2015లో మసాబా గుప్తా బాలీవుడ్ దర్శక నిర్మాత మధు మంతెనని వివాహం చేసుకుంది. మూడేళ్ళ తర్వాత విభేదాలతో ఈ జంట విడిపోయారు. సింగిల్ గా ఉన్న మసాబా సత్యదీప్ మిశ్రాతో ప్రేమలో పడింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.