తన సినిమాలతో సంచలనాలకు తెరతీసిన లేడీ డైరెక్టర్ మీరా నాయర్ తాజాగా ఓ సినిమా తెరకేక్కిస్తోంది. ఇప్పటివరకు ఈమె పలు బోల్డ్ కాన్సెప్ట్ లను ఎన్నుకొని సినిమాలుగా రూపొందించారు. 'సలామ్ బాంబే'తో అవార్డులు, రివార్డులు అందుకున్న ఈ డైరెక్టర్ 'కామసూత్ర' అనే సినిమా తెరకెక్కించి షాక్ ఇచ్చింది.

వైవిధ్యభరితమైన చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోన్న ఈమె బీబీసీ వాళ్ల కోసం ఓ టీవీ సిరీస్ ని సిద్ధం చేస్తోంది. 'ఏ సూటబుల్ బాయ్' పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఇందులో ప్రధాన పాత్రలో నటి టబు నటిస్తోంది.

రీల్ స్టార్స్.. రియల్ బ్రేకప్స్.. ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్స్!

90వ దశకంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ ఇప్పటికీ గ్లామర్ లుక్ తో యూత్ ని ఆకట్టుకుంటోంది. 48 ఏళ్ల వయసొచ్చినా ఇప్పటికీ తన అందంతో మెప్పిస్తోంది. తన వయసుకి తగ్గ పాత్రలు ఎన్నుకుంటోన్న టబు.. మీరా నాయర్ రూపొందిస్తోన్న ఈ బోల్డ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇందులో ఇషాన్ ఖట్టర్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ సిరీస్ ఈ కాలానికి చెందిన కథ కాదు. ఒక వరండాలో నాలుగు కుటుంబాలు నివసించిన కాలాలకు సంబంధించిన కథ అని.. ఆ సమయంలో తనకంటే వయసులో పెద్దదైన మహిళతో కుర్రాడి ప్రేమకు సంబంధించిన కథాంశమని తెలుస్తోంది. 

విక్రమ్ సేథ్ రాసిన కథ ఆధారంగా ఈ టీవీ సీరిస్ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో టబు, ఇషాన్ ఖట్టర్ ల మధ్య కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. గతంలో కూడా ఆంటీ, అబ్బాయ్ ల చుట్టూ తిరిగే కథలు వచ్చాయి.

మలయాళీ సినిమా 'రతి నిర్వేదం' సంచలనం రేపింది. మరి సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన మీరా నాయర్ రూపొందిస్తోన్న ఈ సిరీస్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!