అసభ్య పదజాలంతో వాడుతూ.. అశ్లీల వీడియోలతో తనను చిత్రహింసలు పెడుతున్నారని, ఉదయాన్నే ఫోన్ చూడాలంటే భయం వేస్తోందని సినీ నటి కళ్యాణి అలియాస్ కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొద్దిరోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ పనులు చేస్తున్నారని.. కొన్ని నంబర్లను బ్లాక్ చేసినా.. వేరే ఫోన్ నంబర్ల ద్వారా వీడియోలు పంపుతున్నారని ఆమె తెలిపింది. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని.. కొన్నింటిలో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నారంటూ తెలిపింది.

హాట్ హాట్: బీచ్ లో బికినీ వేసి బీభత్సం..ఫ్యాన్స్ కు అందాల ఉత్సవం

వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరింది. క్రైస్తవ సంఘాల ప్రతినిధుల పేరుతో కొద్దిరోజుల నుండి కొందరు వ్యక్తులు హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా యూట్యూబ్, ఫేస్ బుక్ లలో కథనాలు, వీడియోలను అప్లోడ్ చేస్తున్నారని కరాటే కళ్యాణి పోలీసులకు వివరించారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కళ్యాణి ఎన్నో సినిమాలు చేసింది. 'కృష్ణ' సినిమాలో బ్రహ్మానందంతో ఆమె చేసిన కామెడీ బాగా పండింది. ఇప్పటికీ ఆ సినిమాలో ఆమె డైలాగ్ ని వాడుతుంటారు.