అర్జున్ సురవరం.. యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ గత ఏడాది నుంచి ఈ సినిమాతోనే కాలాన్ని గడుపుతున్నాడు. మొదట్లో సినిమాకు క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంత కాదు. రిలీజ్ చేయాల్సిన సమయం దగ్గరపడుతున్నప్పుడల్లా సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

మొత్తానికి ఈ నెల 29న రిలీజ్ చేయడానికి అర్జున్ గ్యాంగ్ సిద్ధమైంది.  అయితే సినిమా వాయిదాల కారణంగా బజ్ తగ్గింది. దీంతో నిఖిల్ ప్రమోషన్స్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నిఖిల్ కోసం మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)   

గతకొన్ని రోజులుగా ఈ విషయంపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.  అయితే మొత్తానికి మెగాస్టార్ ని కలిసి నిఖిల్ వేడుకకు రావడానికి ఒప్పించాడు. ఈ విషయాన్నీ నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియాజేశాడు. ఈ నెల 26న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా గ్రౌండ్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించేందుకు చిత్ర యూనిట్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. అభిమానులు పెద్ద సంఖ్యలో రాబోతున్నట్లు తెలుసుకున్న సినిమా యూనిట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి మెగాస్టార్ రాకతో నిఖిల్ సినిమా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.