మెగాస్టార్ ఫ్యామిలి నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన ప్రతి ఒక్కరు ఎదో ఒక విధంగా క్లిక్ అవుతున్నారు. అయితే మేల్ డామినేషన్ ఉన్నంతగా ఫీమేల్ డామినేషన్ కనిపించడం లేదు. నాగబాబు హీరోగా సక్సెస్ అవ్వకపోయినా సపోర్టింగ్ రోల్స్ తో క్లిక్కయ్యారు. ఇక హీరోల మార్కెట్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఎవరికి వారు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకొని కెరీర్ ను ఒక ట్రాక్ లో కొనసాగిస్తున్నారు.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. మెగా డాటర్స్ లో మొదట ఎంట్రీ ఇచ్చిన నిహారిక హీరోయిన్ గా ఎదో ప్రయోగాలు చేసినప్పటికీ అంతగా క్రేజ్ అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ కూతురు కొణిదెల వారి పెద్దమ్మాయి సుష్మిత మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది.

read also చంటి నుంచి F2 వరకు.. వెంకటేష్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

కాస్ట్యూమ్ డిజైనర్ గా మెగాస్టార్ రెండు సినిమాలకు ఆమె వర్క్ చేసిన విషయం తెలిసిందే.  ఖైదీ నెంబర్ 150లో ఆమె పనితనం బాగానే ఉన్నప్పటికీ సైరా సినిమాలో మాత్రం ఆమె వర్క్ పెద్దగా క్లిక్కవ్వలేదు. ఆమె డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ పై కొంత నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. అయితే ఈ సారి సుష్మిత నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ముందుగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో వెబ్ సిరీస్ లను నిర్మించి ఆ ఆ తరువాత సినిమాల వైపు అడుగు వేయాలని ఆమె ప్లాన్ చేసుకుంటున్నారట. ప్రస్తుతం సినిమా కథలను కూడా వింటున్నట్లు టాక్ వస్తోంది. వచ్చే ఏడాది కెరీర్ ని సరికొత్తగా డిజైన్ చేసుకోవాలని చూస్తున్న సుష్మిత నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.