పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ చిత్రంలో నటించిన కృతి కర్బందా గుర్తుందిగా. ఆ చిత్రంలో లంగాఓణిలో కృతి కర్బందా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒంగోలు గిత్త, బ్రూస్ లీ లాంటి చిత్రాల్లో కూడా కృతి నటించింది. సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. కృతి కర్బందా ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. 

గత ఏడాది కృతి నటించిన హౌస్ ఫుల్ 4 చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తరచుగా సెలెబ్రిటీలు విమానయాన సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కృతి కర్బందా ఎయిర్ ఇండియా బాధితురాలిగా మారారు.  ఎయిర్ ఇండియా విమానంలో తన లగేజ్ మిస్ అయిందని కృతి ట్వీట్ చేసింది. 

ఆగ్రహంతో విరుచుకుపడుతూ ఎయిర్ ఇండియా నిర్వాకంపై ట్వీట్ చేసింది.  'డియర్ ఎయిర్ ఇండియా.. మరోసారి నా లగేజ్ పోగొట్టినందుకు థాంక్స్. మీ సిబ్బందికి కొంచెం మర్యాద నేర్పించండి' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందిస్తూ.. మా క్షమాపణలు అంగీకరించగలరు.. మీ బ్యాగ్ నంబర్, ఇతర వివరాలు తెలియజేస్తే మా టీం తో చర్చించి సమస్యని పరిష్కరిస్తాం అని ఎయిర్ ఇండియా కృతి ట్వీట్ కు బదులిచ్చింది. 

దీనిపై కృతి కర్బందా బదులిస్తూ.. మీ క్షమాపణలు నేను అంగీకరిస్తా.. కానీ అసలు నా బ్యాగ్ వివరాలు మీ సిబ్బందికే తెలియవు అంటూ చురుకలు అంటించింది. మొత్తంగా ఎంతో శ్రమించిన తర్వాత తన లగేజ్ తన వద్దకు వచ్చిందని కృతి పేర్కొంది. 

మీడియం రేంజ్ హీరోల ఫస్ట్ డే బాక్సాఫీస్ రికార్డ్స్.. టాప్ లీగ్ కు వెళ్లే సత్తా ఎవరికుంది!