మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అనంతరం కొరటాల శివ డైరెక్షన్ లో నటించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ఇంకా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వకముందే సినిమా టెక్నీషియన్స్ కి సంబందించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొరటాల మొదటిసారి తనకు ఇష్టమైన టెక్నీషియన్ ని కూడా మెగాస్టార్ కోసం పక్కనెట్టేస్తున్నట్లు సమాచారం.  

మిర్చి సినిమా ద్వారా దర్శకుడు కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ తో జర్నీ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సినిమా మ్యూజిక్ క్లిక్కవ్వడంతో ఆ తరువాత శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ - భరత్ అనే నేను సినిమాలకు కూడా కొరటాల రాక్ స్టార్ తోనే మ్యూజిక్ చేయించుకున్నాడు. తనకు ఇష్టమైన విధంగా దేవి కంపోజ్ చేస్తాడని దర్శకుడు కొరటాల చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు.

అయితే ఈ కాంబోకి మొదటిసారి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మెగాస్టార్ నెక్స్ట్ సినిమాకు కూడా బాలీవుడ్ సంగీత దర్శకులను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  మొదట సైరా సినిమాకు మ్యూజిక్ అందించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదికి మెగాస్టార్ మరో అవకాశం ఇచ్చినట్లు టాక్ వచ్చింది.

ఇక ఇప్పుడు అజయ్ - అతుల్ ;లకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఈ సంగీత ద్వయం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, జీరో’ సినిమాలకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి మంచి క్రేజ్ అందుకున్నారు.

ఆ సినిమాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఫిదా అయిన చిరు నెక్స్ట్ కొరటాల శివ తో చేయబోయే సినిమాకు కూడా ట్యూన్స్ చేయాలనీ అఫర్ ఇచ్చేశాడు. దీంతో కోరటాల తన ఆస్థాన సంగీత దర్శకుడిని పక్కనెట్టక తప్పడం లేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

క్రేజీ కాంబినేషన్ ఎప్పుడైనా పట్టాలెక్కొచ్చు.. ఆ రోజేస్తే ఫ్యాన్స్ కి పండగే