మెగాస్టార్ చిరంజీవి మొత్తానికి సైరా సినిమాతో తన చిరకాల కోరిక తీర్చుకున్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ యుద్ధ సన్నివేశాలున్న సినిమాలో నటించాలని అనుకున్న చిరంజీవి సైరాతో తన కలను నెరవేర్చుకున్నారు. కానీ సినిమాకు పెట్టిన బడ్జెట్ అయితే వెనక్కి రాలేదు. సినిమాను ఫ్యాన్ ఇండియా లెవెల్లో నిర్మాత రామ్ చరణ్ ప్రమోట్ చేయలేకపోయాడు.

మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సినిమా కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఇకపోతే నెక్స్ట్ కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ నటించబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ఎండింగ్ కి వచ్చాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టనున్నారు.

Read also: దేవిని కొరటాల కూడా లైట్ తీసుకున్నాడా..?

అసలు మ్యాటర్ లోకి వస్తే.. రామ్ చరణ్ మలయాళం మూవీ లూసిఫర్ తెలుగు రైట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తెలుగులో రిలీజ్ అయినప్పటికీ సోల్ పాయింట్ ని తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ తో మరింత గ్రాండియర్ గా తెరకెక్కించాలని చరణ్ ఆలోచించాడు. ఆ సినిమాకు దర్శకుడిగా సుకుమార్ అనుకున్నారని తెలిసింది.

మొదట సుకుమార్ కూడా పాజిటివ్ గా స్పందించినప్పటికీ మళ్ళీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. రీమేక్ కథలని తెరకెక్కించడం కంటే సొంత కథతో మెగాస్టార్ తో సినిమా చేస్తానని రామ్ చరణ్ కి డైరెక్ట్ గా చెప్పేశాడట.  దీంతో రామ్ చరణ్ ఎలాగైనా లూసిఫర్ ని వచ్చే ఏడాది ఎండింగ్ లోనే సెట్స్ పైకి తేవాలని వేరే దర్శకులతో చర్చలు జరుపుతున్నారట.

కొరటాల శివ సినిమా షూటింగ్ సగం పూర్తయిన అనంతరం లూసిఫర్ ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చరణ్ కూడా RRR ముగిసిన అనంతరం ఈ ప్రాజెక్ట్ స్పెషల్ ఫోకస్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. మరి మెగాస్టార్ ని లూసిఫర్ లో చూపించే ఆ లక్కీ దర్శకుడు ఎవరవుతారో చూడాలి.