మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆచార్య అనే టైల్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా వచ్చి పడింది. దీనితో దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. 

దీనితో ఆచార్య షూటింగ్ కూడా ఆగిపోయింది. ప్రస్తుతం తీరిక సమయంలో చిరు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రాజకీయాల గురించి ప్రస్తావన రాగా.. ప్రస్తుతం నా వయసు 64 ఏళ్ళు.. ఈ వయసులో నాకు రాజకీయాలు, రాజకీయ పార్టీలు నడపాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తుంటాడు. రాజకీయ విషయాలు మాట్లాడడు. మా మధ్యన కుటుంబ విషయాలే చర్చకు వస్తాయి. 

65 ఏళ్ల ముసలాడు.. నిన్ను చూడాలి, బట్టలు విప్పు అన్నాడు.. నటి కామెంట్స్

నేను, పవన్ కళ్యాణ్ విభిన్నమైన దారుల్లో ప్రయాణిస్తుండవచ్చు.. మా ఇద్దరి ఆశయం ఒక్కటే. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు చేయగలిగినది అంతా చేశాను. ప్రస్తుతం పవన్ జనసేన పార్టీని లీడ్ చేస్తున్నాడు. జనసేన పార్టీకి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. 

అలాగే మా కుటుంబ సభ్యులం అంతా పవన్ కు అవసరమైన మద్దతు అందిస్తాం అని చిరంజీవి తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాడు. పవన్ అనుకున్నది సాధిస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉందని చిరంజీవి అన్నారు.