చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం ప్రముఖ నటి తనుశ్రీ దత్తా తేనె తుట్టెని కదిపినట్లు ఇండియాలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని కదిపింది. దీనితో ఇండియాలో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు బండారం బయట పడింది. 

చాలా మంది నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపులని ధైర్యంగా చెప్పుకున్నారు. ఇప్పటికి కొంతమంది హీరోయిన్లు, నటీమణులు తమపై జరుగుతున్న లైంగిక దాడుల్ని బయటపెడుతున్నారు. తాజాగా యంగ్ బ్యూటీ, బుల్లితెర హీరోయిన్ అయిన మల్హర్ రాథోడ్ తనకు ఎదురైనా అనుభవాన్ని విసరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

మహేష్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్.. ఉదయ్ కిరణ్ సినిమా కూడా ఉంది

65 ఏళ్ల నిర్మాత తనని ఆడిషన్స్ కు పిలిచి ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో వివరించింది. ఆడిషన్స్ కోసం నన్ను పిలిచారు. అతడివయసు 65 ఏళ్ళు. రూమ్ లోకి రావాలని నన్ను పిలిచారు. అక్కడకు వెళితే డ్రెస్ విప్పు.. నిన్ను చూడాలి అని అన్నాడు. అతడి మాటలకు షాకయ్యా.

అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేశానని మల్హర్ తెలిపింది. ఈ సంఘటన కొన్నేళ్ల క్రితం జరిగిందని మల్హర్ పేర్కొంది. టివి రంగంలోకూడా లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని మల్హర్ పేర్కొంది.