మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో మంచి సోషల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ ఒక నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూల్ గా కనిపించే మెగాస్టార్ సెకండ్ హాఫ్ లో ఊహించని విధంగా యాక్షన్ మోడ్ లో మంచి ఎమోషన్ ని క్రియేట్ చేసే పాత్రలో నటించబోతున్నారట.

 అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే విషయంలో దర్శకుడు కొరటాల ఇటీవల మెగాస్టార్ తో చర్చలు జరిపారట. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక వీలైనంత త్వరగా సమ్మర్ ఎండింగ్ లో సినిమాను పూర్తి చేసి ఆగస్ట్ లో రిలీజ్ చేయాలనీ మెగాస్టార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కొరటాల కూడా ఆ డేట్ ని లాక్ చేసుకొని తన  షెడ్యుల్స్ లో మార్పులు చేసుకున్నట్లు సమాచారం. కరెక్ట్ గా ఆగస్ట్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారట.

హీరోల రేంజ్ లో విలన్స్ జీతాలు.. పని తక్కువైనా ఆదాయం ఎక్కువే

 అసలైతే సైరా సినిమాని ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ షూటింగ్ కారణంగా కుదరలేదు. ఇక 2020లో అయినా ఇండిపెండెన్స్ డే ని ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని మెగాస్టార్ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని బడ్జెట్ విషయంలో ఏ మాత్రం లిమిట్స్ పెట్టలేదట. నిర్మాత రామ్ చరణ్ - మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మెగాస్టార్ 152 ప్రాజెక్టుని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం చిత్ర యూనిట్ చాలా బిజీగా ఉంది. ఇప్పటికే మణిశర్మతో కలిసి ఒక ట్యూన్ కూడా రెడీ చేశాడు. చాలా ఎల్లా తరువాత మణిశర్మ మెగాస్టార్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చివరగా వీరి కాంబినేషన్ లో స్టాలిన్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మళ్లి 13 ఏళ్ళ తరువాత మెగాస్టార్ సినిమాకు మణిశర్మ ట్యూన్స్ చేస్తున్నాడు. ఇకపోతే సినిమాలో మెగాస్టార్ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తూనే సీక్రెట్ నక్సలైట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  

దర్శకుడు కొరటాల స్క్రీన్ ప్లేలో ఈ సారి చాలా స్ట్రాంగ్ ట్విస్ట్ లో తెరపై ప్రజెంట్ చేయబోతున్నాడట. ఇక రామోజీ ఫిలిం సిటీలో స్ఇప్పటికే కొన్ని స్పెషల్ సెట్స్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం కి సంబందించిన ఒకప్పటి  వాతావరణాన్ని సినిమాలో స్పెషల్ గా ప్రజెంట్ చేయనున్నారట. ఇక మెగాస్టార్ కోసం స్పెషల్ యాక్షన్ సీన్స్ ఇప్పటికే కొరటాల డిజైన్ చేసుకున్నట్లు టాక్. సైరా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని మెగాస్టార్ కష్టపడనున్నారు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.