మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రాబోతున్న మరో కుర్ర హీరో వైష్ణవ్ తేజ్. ఈ హీరో మొదటి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు  ఏర్పడ్డాయి. సినిమాకు సంబందించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుకుమార్ ప్రొడక్షన్ లో తెరక్కుతున్న ఈ సినిమాకు ఉప్పెన అనే టైటిల్ ని అనుకుంటున్నారు.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ కూడా సుకుమార్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఉప్పెన ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే వైష్ణవ్ తేజ్ మరో సినిమాని ఒకే చేసినట్లు తెలుస్తోంది. అలా మొదలైంది - ఓ బేబీ వంటి హిట్ చిత్రాల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీలో నటించబోతున్నాడట. మెగాస్టార్ కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది 

ఉప్పెన సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి అనంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ఆ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఇకపోతే నందిని రెడ్డి డైరెక్షన్ లో చేయబోయే సినిమాను నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తెరపైకి  తేనుంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.

also read: సుకుమార్, మెగా హీరో సినిమా నుంచి అతడు తప్పుకున్నాడా!

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న డెబ్యూ మూవీ 'ఉప్పెన'. ఈ చిత్రంలో వైష్ణవ్ కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నిర్మాణంలో తెరక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ కథ అందిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. 

విభిన్నమైన కథతో తెరక్కుతున్న ఈ చిత్రంపై అప్పుడే పుకార్లు మొదలయ్యాయి. ఈ చిత్రంలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతవరకు విజయ్ సేతుపతి షూటింగ్ లో పాల్గొనక పోవడంతో వేగంగా ఈ రూమర్లు వ్యాపించాయి. 

విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదట. అందుతున్న సమాచారం మేరకు విజయ్ సేతుపతి షూటింగ్ లో పాల్గొనే షెడ్యూల్ ఆగష్టు నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చిత్ర కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంలో జాలరి పాత్రలో నటిస్తున్నాడు. ఉప్పెన చిత్రం పై నెలకొన్న గందరగోళం తొలగాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.