Asianet News Telugu

మెగా సీరియల్: కొత్త పాత్ర ఎంట్రీతో మలుపు తిరిగిన కళ్యాణ వైభోగం

టీవీ సీరియల్స్ ఎప్పుడు ముగుస్తుయో తెలియదు. డైలీ సీరియల్స్ కూడా ఏళ్ల తరబడి కొనసాగడం తెలుగు టీవీ చానెళ్లకు సంబంధించి కొత్తేమీ కాదు. జీ తెలుగులో ప్రసారమవుతున్న కళ్యాణ వైభోగం సీరియల్ బహు మలుపులు తిరుగుతూ తాజాగా మరో మలుపు తీసుకుంది. 

Mega TV serial: New character enters in kalyana Vaibhogam
Author
Hyderabad, First Published Nov 9, 2019, 5:39 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీవీ సీరియల్స్ ఎప్పుడు ముగుస్తుయో తెలియదు. డైలీ సీరియల్స్ కూడా ఏళ్ల తరబడి కొనసాగడం తెలుగు టీవీ చానెళ్లకు సంబంధించి కొత్తేమీ కాదు. జీ తెలుగులో ప్రసారమవుతున్న కళ్యాణ వైభోగం సీరియల్ బహు మలుపులు తిరుగుతూ తాజాగా మరో మలుపు తీసుకుంది. 

మరిన్ని రోజులు కొనసాగడానికి ఈ మలుపు పనికి వస్తుంది. ఆ మలుపు కోసం కొత్త పాత్రను ప్రవేశపెట్టారు. కల్యాణ వైభోగం సీరియల్ కవల ఆడపిల్లలను బేస్ చేసుకుని నడిపిస్తున్నారు. పురిటిలోనే విడిపోయిన ఇద్దరు ఆడపిల్లల కథ ఇది. నెంబర్ వన్ బిజినెస్ వుమెన్ పిల్లలు వాళ్లు. అయితే, ఒక కూతురు ఆమెకు తెలియకుండా పేదల ఇంట్లో పెరుగుతుంది. ఆ పిల్ల ఎదిగి యుక్తవయస్సుకు వచ్చిన తర్వాత బిజినెస్ వుమెన్ వద్ద చేరుతుంది. ఆమె పేరు మంగ తాయారు.

'రూలర్' : బాలయ్య కొత్త లుక్.. కుర్రాళ్లకు గట్టి పోటీనే..!

జై అనే వ్యాపారవేత్తకు తన రెండో కూతురు నిత్యను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. అయితే, జై కుటుంబంలో పెళ్లి తర్వాత ఆడవాళ్ల చనిపోయే విధంగా శాపం ఒక్కటి ఉంటుంది. ఆ శాపం నుంచి నిత్యను తప్పించడానికి మంగ తాయారును ఆ బిజినెస్ వుమెన్ వాడుతుంది. మంగ తాయారు జైని పెళ్లి చేసుకుని, అతనితో ఫస్ట్ నైట్ గడిపాల్సి ఉంటుంది. తొలి రాత్రి సంభోగం జరిగితే జై భార్య మరణిస్తుంది. 

మంగ తాయారును నిత్యగా నమ్మిస్తూ ఆ బిజినెస్ వుమెన్ కథ నడిపిస్తూ ఉంటుంది. మంగతాయారు చనిపోయిన తర్వాత నిత్యను ఆ స్థానంలో నిలబెట్టాలని అనుకుంటుంది. అయితే, శాపం నుంచి మంగతాయారు తప్పించుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో  నిత్య చనిపోయినట్లుగా మంగతాయారును నమ్మిస్తుంది. ఈ మధ్యలో మంగతాయారు తన కూతురే అని తెలిసి, ఆమెకు అన్యాయం చేయడం ఇష్టం లేక బిజినెస్ వుమెన్ సాఫ్ట్ గా మారిపోతుంది. 

అలా మారిపోయిన తర్వాత మంగతాయారును చంపడానికి నిత్య ప్లాన్ లు వేస్తూ ఉంటుంది. నిత్య చనిపోయిందని జైని, ఆయన కుటుంబ సభ్యులను నమ్మిస్తూ ఉంటారు. మరణగండాన్ని తప్పించుకుని వచ్చిన మంగతాయారు కూడా అదే పని చేస్తూ ఉంటుంది. నిత్యను పూర్తిగా నమ్ముతూ ఉంటుంది. అయితే, నిత్య మాత్రం మంగను చంపేసి ఆ స్థానంలోకి రావాలని అనుకుంటూ ఉంటుంది. మంగను చంపడానికి వేసిన ప్లాన్ లన్నీ బెడిసి కొడుతూ ఉంటాయి.

ఈ క్రమంలో నిత్య బతికే ఉందనే అనుమానాలు జైకి కలుగుతాయి. మంగను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని సెక్యూరిటీ ఏర్పాటు చేసి, హత్యాప్రయత్నాలు చేస్తున్నవారిని పట్టుకోవడానికి జై ప్రయత్నిస్తూ ఉంటాడు. 

ఈ స్థితిలో సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ రాణా ఎంటరయ్యాడు. అతను విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ హైదరాబాదులో కూడా తన వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటాడు. హైదరాబాదుకు వచ్చిన రాణాకు నిత్యతో ఎన్ కౌంటర్ జరుగుతుంది. నిత్య తల్లి వద్ద బిజినెస్ పాఠాలు నేర్చుకోవాలని రాణాకు అతని తండ్రి ఉపదేశిస్తాడు. దీంతో రాణా నేరుగా బిజినెస్ వుమెన్ ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే బయట నిత్యతో ఎన్ కౌంటర్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇంట్లోకి వచ్చిన తర్వాత నిత్య ఎదురు కావడంతో ఆశ్చర్యపోతాడు. నిత్యను పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. 

ఈలోగా రాణాకు మరో ఆశ్చర్యకరమైన సంఘటన ఎదరువుతుంది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి రాణా జైతో పోటీ పడుతాడు. ఇద్దరు వేలంపాటలో పోటాపోటీగా పాల్గొంటారు. చివరకు జై వెనక్కి తగ్గాలని అనుకుంటున్న సమయంలో మంగ ఎంటరవుతుంది. వేలంపాటలో అత్యధికంగా కోట్ చేసి జైకి కాంట్రాక్టు వచ్చేలా చేస్తుంది. అంత కోట్ చేస్తే నష్టాల పాలవుతామని జై సహాయకుడు అంటే, నష్టం కన్నా జై పరువు ముఖ్యమని అంటుంది. 

మోడర్న్ డ్రెస్ లో చూసిన నిత్యనే సంప్రదాయ దుస్తుల్లో ఇక్కడికి వచ్చిందని, నిత్యనే జై భార్య అని అనుకుని రాణా నిశ్చేష్టుడవుతాడు. ఆ విషయం జై వద్ద చెబుతాడు. తాను ఇంట్లో నిత్యను చూశానని రాణా చెబుతాడు. దాంతో జై అనుమానం మరింతగా బలపడుతుంది. రాణా నిత్య ఇంటికి వెళ్తాడు. నిత్య మోడర్న్ డ్రెస్ లో కనిపిస్తుంది. జై భార్య కదా అని ఆరా తీస్తాడు. 

ఇదంతా జరుగుతుండగానే జై మంగతో కలిసి అక్కడికి వస్తాడు. దాంతో నిత్య విషయం జైకి తెలుస్తుంది. మంగను చంపి ఆమె స్థానంలోకి వెళ్లాలని భావిస్తున్న నిత్య మనసు మాత్రం మారదు. ఇక్కడి నుంచి సీరియల్ ను మరో మలుపు తిరుగుతుందనే సంకేతాలను ఇచ్చారు. నిత్య, రాణాల మధ్య కథను నడిపించి మరింత కాలం కొనసాగించడానికి అవసరమైన ప్రాతిపదికను సీరియల్ కు ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios