మెగా డాటర్ నిహారిక టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. కానీ అదృష్టం కలసి రావడం లేదు. నిహారిక ఇప్పటికే కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ సక్సెస్ దక్కలేదు. ప్రస్తుతం నిహారిక వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. హీరోయిన్ గా రాణించాలంటే గ్లామర్ ఎంతో కొంత అవసరం. 

హద్దులు దాటకుండానే తనలో ట్యాలెంట్ బయటపెట్టేందుకు నిహారిక ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నిహారిక ట్రెండీ దుస్తుల్లో ఉన్న ఫోటో షూట్స్ ని అభిమానులతో పంచుకుంటోంది. బుధవారం రోజు ఇంటర్నేషనల్ డాన్స్ డే జరిగింది. ఈ సందర్భంగా నిహారిక తన ఫస్ట్ డాన్స్ వీడియోతో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. 

సినిమాలో శృంగార సన్నివేశం.. అదే దర్శకుడితో హీరోయిన్ వివాహం

అది మామూలు సర్ ప్రైజ్ కాదు.. నిహారిక పెర్ఫామ్ చేసిన ఈ రొమాంటిక్ డాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ యాశ్వంత్ మాస్టర్ తో కలసి నిహారిక డాన్స్ చేసింది. బ్యాగ్రౌండ్ లో చెలి చిత్రంలోని 'మనోహర' సాంగ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉండగా నిహారిక, యాశ్వంత్ మాస్టర్ మతిపోగోట్టే డాన్స్ మూవ్మెంట్స్ తో అలరించారు. 

ఇద్దరూ పర్ఫెక్ట్ సింక్ లో డాన్స్ చేసిన ఈ వీడియోకి ప్రశంసలు దక్కుతున్నాయి. నిహారిక బ్లాక్ డ్రెస్ లో కనిపించింది. రొమాంటిక్ లోకంలోకి తీసుకెళ్లేలా ఉన్న నిహారిక డాన్స్ ని మీరూ  చేయండి.