డిఫరెంట్ పాయింట్ ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో అందరికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించే దర్శకుడు మారుతి. సినిమా ఎలా ఉన్నా మారుతి తన టైమింగ్ ని ఏ మాత్రం మిస్ చేయకుండా కామెడీని హైలెట్ చేస్తాడు. ప్రతిరోజు పండగే సినిమాతో కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు మారుతి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడా  అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇటీవల వచ్చిన రూమర్స్ ప్రకారం మారుతి నెక్స్ట్ సినిమా కొత్త హీరోతో చేయనున్నట్లు టాక్ వచ్చింది. RRR నిర్మాత డివివి.దానయ్య తన కొడుకుని గ్రాండ్ గా లాంచ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకు మారుతిని సంప్రదించగా మొదటి ఒకే చెప్పిన దర్శకుడు కొన్ని రోజుల తరువాత చేయనని చెప్పేశారట. దర్శకుడికి మొదటి నుంచి భారీ పారితోషికాన్ని అఫర్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ ప్రాజెక్ట్ కోసం మారుతికి 6కోట్ల వరకు పేమెంట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు టాక్ వస్తోంది. గతంలోనే తేజకు ఈ అఫర్ చేసినప్పటికీ అప్పుడు వేరే సినిమాలతో బిజిగా ఉండడంతో చేయలేకపోయాడట. ఇక ఇప్పుడు మారుతి రిస్క్ చేయడం ఇష్టం లేక దానయ్య చేసిన అఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానయ్య కుమారుడు యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరీ మారుతి రిజెక్ట్ చేసిన ఆ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

96 రీమేక్ ఫస్ట్ లుక్.. ఎడారిలో ఒంటరిగా శర్వా