ప్రముఖ మరాఠీ నటి సారా శ్రవణ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీకి చాలా మంది ఫ్యాన్ ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది. సారా శ్రవణ్ ని ముంబై క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆమె రూ.15 లక్షల రూపాయలను బలవంతంగా వసూలు చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆమెని అరెస్ట్ చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. సారా శ్రవణ్.. సుభాష్ యాదవ్ అనే నటుడితో ఒక సినిమాలో నటించింది.

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్..టాలీవుడ్ సెలెబ్రిటీలు సందడి.. ఫొటోస్

ఈ సినిమా విడుదలైన తరువాత సారా.. సుభాష్ తనను వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఈ గొడవ విషయంలో మధ్యవర్తిగా  వ్యవహరించిన రామ్ జగదాలే అనే వ్యక్తి సుభాష్ యాదవ్ ని డబ్బుల కోసం బెదిరించాడు.

ఈ క్రమంలో సుభాష్ యాదవ్ తన తప్పులకు క్షమాపణలు వేడుకున్నాడు. దీన్ని రామ్ జగదాలే వీడియో తీశాడు. ఈ వీడియోను బయట పెట్టకుండా ఉండాలంటే రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.