మొత్తానికి ప్రయత్నాలు ఫలించి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు `పొన్నియిన్ సెల్వన్`  పట్టాలు ఎక్కుతోంది.  లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ముందుకు రావడంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ప్రముఖ రచయిత కల్కీ కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఖడ్గాన్ని మాత్రమే వుంచి  ఇంగ్లీష్ అక్షరాల్లో టైటిల్ ని వదిలారు. ఓ కొండ ప్రాంతంలో పడిన సూర్యరశ్మి ఈ కత్తిపై అంచున పడుతున్నట్లు చూపించారు.

ఈ సినిమాని `బాహుబలి` తరహాలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ సినిమా క్రూలో పాటల రచయిత పేరు వైరముత్తు కనపడకపోవటం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి ఆస్కార్‌ గ్రహీత ఎ.ఆర్‌ రెహమన్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని 12 పాటలకు వైరముత్తు సాహిత్యం అందిస్తున్నారని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విషయంపై అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేయటంతో పోస్టర్ పై వేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

'జబర్దస్త్' గ్యాంగ్.. నాగబాబుని వదలడం లేదు!

తమను వేధింపులకు గురిచేశారని గాయిని చిన్మయితోపాటు మరికొందరు మహిళలు వైరముత్తు గురించి ‘మీ టూ’ ఉద్యమంలో తెలిపారు. అయితే ‘మీ టూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తు లాంటి వ్యక్తికి ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో అవకాశం ఇవ్వడంతో సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఇబ్బంది ఎదురౌతోంది. దానికి తోడు వైరముత్తు ఉన్న ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోమని ఎ.ఆర్‌ రెహమన్‌ను ఉద్దేశించి ట్వీట్లు చేసారు.
 
మణిరత్నం తెరకెక్కించిన 'చెక్క చివంత వానం' చిత్రం 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను తెలుగులో ‘నవాబ్‌’ పేరుతో విడుదలయ్యింది. అరవింద స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్‌, ఐశ్వర్య రాజేశ్‌, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు.