హీరో మంచు విష్ణు తదుపరి చిత్రం గురించి టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మంచు విష్ణు ప్రస్తుతం భారీ బడ్జెట్ లో భక్త కన్నప్ప అనే చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. విష్ణు చివరగా ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ లాంటి చిత్రాల్లో మెరిశాడు. 

విష్ణు కెరీర్ లో ఢీ చిత్రం ఓ మెమొరబుల్ హిట్ గా నిలిచిపోతుంది. శ్రీమువైట్ల దర్శత్వంలో తెరకెక్కిన ఢీ చిత్రం 2007లో విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది.  శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో మంచు విష్ణు కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. 

ఢీ తర్వాత మరోసారి విష్ణు, శ్రీనువైట్ల కాంబోలో సినిమా రాలేదు. తాజాగా శ్రీనువైట్ల తదుపరి చిత్రం మంచు విష్ణుతో ఉండబోతోందని.. ఢీ చిత్రాన్ని సీక్వెల్ గా ఢీ 2 తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మంచు విష్ణు స్పందించాడు. విష్ణు కామెంట్స్ అభిమానులని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉన్నాయి. 

'చాలా మంది ఫోన్ చేసి శ్రీనువైట్ల గారి దర్శత్వంలో ఢీ 2 ప్రారంభమైందని భావిస్తూ నాకు కంగ్రాట్స్ చెబుతున్నారు. శ్రీనువైట్ల గారు నాకు అన్న లాంటి వ్యక్తి. ఢీ 2 గురించి ఆయన్ని అడిగితేనే మంచిది. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు' అంటూ విష్ణు ట్వీట్ చేశాడు. 

అమ్మాయితో జడ్జి బూతులు.. ఆ టైంలో ఎన్టీఆర్ సీఎం.. నటి కిన్నెరపై సంచలన వ్యాఖ్యలు

విష్ణు కామెంట్స్ బట్టి చూస్తే ప్రస్తుతం శ్రీనువైట్ల ఢీ 2 చిత్ర కథ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారా వేచి చూడాలి.