నటుడు మంచు మనోజ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చాలా కాలంగా మనోజ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. మనోజ్ చివరిగా నటించిన చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. అయితే ఈ మధ్యనే తన భార్యకి విడాకులిచ్చి వార్తల్లో నిలిచాడు మనోజ్.

ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యతో మనస్పర్ధలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించాడు. ప్రస్తుతం మనోజ్ సింగిల్ గానే ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ హీరో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

సమంత ట్వీట్.. మహేష్ అన్న చెప్పినట్లే చేశాడంటున్న మంచు మనోజ్!

ఇప్పుడు తను ఫైర్ బాల్ మాదిరి వెలగడానికి సిద్ధంగా ఉన్నానని.. అభిమానులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు కొత్త సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ అయి ఉంటుందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం 'ఏంటీ ఇంకో పెళ్లా..?' అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇలాంటి ఒక ట్వీట్ చూసిన మనోజ్.. వెంటనే 'వామ్మో..!' అంటూ రిప్లయ్ ఇచ్చాడు. తనపై సెటైర్ ని ఫన్నీగా తీసుకొని స్పందించాడు మనోజ్. ఇది చూసిన నెటిజన్లు 'ఏంటన్నా.. అంత రియాక్షన్ ఇచ్చావ్..?' అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇకపై సినిమాలపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు.