మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి చిత్రం రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సామజిక స్పృహ ఉన్న నటుల్లో మనోజ్ ఒకరు. మనోజ్ లో సామజిక స్పృహ ఉన్నప్పటికీ ఎప్పుడూ సీరియస్ గా ఉండే మనస్తత్వం కాదు.. మనోజ్ లో కొంటె కుర్రాడు కూడా ఉన్నాడు. 

వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు.. అది అందరికి తెలిసిందే. తాజాగా వర్మకు మంచు మనోజ్ తోడయ్యాడు. ఇద్దరూ కలసి మంచు లక్ష్మీని ఆటపట్టించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కరోనా వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొని ఉంది. 

కాస్త ఆటవిడుపుగా ఏ ట్వీట్ చేస్తున్నట్లు వర్మ తెలిపాడు. ఓ టిక్ టాక్ వీడియో పోస్ట్ చేసి ఇందులో చిన్న పాప ఎవరిని ఇమిటేట్ చేస్తుందో చెప్పండి అని అడిగాడు. ఆ వీడియోలో పాపని వాళ్ళ అమ్మ మిలుకు తాగుతావా మిలుకు అని అడుగుతుంది. దానికి పాప మిలుకు కాదు మిల్క్ అని చెబుతుంది. పాప మాటలు వినగానే చెప్పేయొచ్చు ఎవరిని ఇమిటేట్ చేస్తోందో అని. 

ఆ ప్రశ్నకు రాజమౌళి తెలివైన సమాధానం.. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ పై కామెంట్స్!

మనోజ్ ఆర్జీవీ ట్వీట్ పై ఫన్నీగా బదులిచ్చాడు. 'ఇంకెవరు.. అది మన లచ్చక్క.. ఆమ్మో నేను అయిపోయాను.. ఎటూ పారిపోలేను' అని మనోజ్ తన సోదరి మంచు లక్ష్మీ పై సెటైర్స్ వేస్తూ ట్వీట్ చేశాడు.