కరోనా ప్రభావంతో చిత్ర పరిశ్రమ షట్ డౌన్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. అదే రాజమౌళి స్ట్రాటజీ అంటే. ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. సినీ అభిమానుల తీరికని ఉపయోగించుకుంటూ రాజమౌళి ఇటీవల ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, రాంచరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్  రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 

షూటింగ్స్ క్యాన్సిల్ కావడంతో రాజమౌళి కూడా ఇంటికే పరిమితం అయ్యారు. దీనితో రాజమౌళి తాం ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ ప్రముఖ ఫిలిం క్రిటిక్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. 

పెళ్ళైనా తగ్గడం లేదు.. సెక్సీ ఫోజులతో రెచ్చిపోతున్న బ్యూటీ

ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే.. రాంచరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఇద్దరినీ సంతృప్తి పరిచే విధంగా ఈ చిత్రం ఉంటుందా అని. దీనికి రాజమౌళి చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నిజమే.. కానీ వాళ్లకన్నా ఎక్కువగా జనరల్ ఆడియన్స్ ఉన్నారు. సినిమా వారిని సంతృప్తి పరిచే విధంగా ఉండాలని రాజమౌళి తెలిపారు. అదే సమయంలో అభిమానుల అంచనాలని కూడా తాను దృష్టిలో పెట్టుకుంటానని రాజమౌళి చెప్పుకొచ్చారు. 

చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ సినిమా రంగంలో పోటీ ఉన్న కుటుంబాల నుంచి వచ్చారు. అలాంటి హీరోలు కలసి నటించడం జనరల్ ఆడియన్స్ కు ఆసక్తిని పెంచే విషయం. తాను కూడా స్పైడర్ మాన్, సూపర్ మాన్ కలసి వస్తే ఎలా ఉంటుంది అని తరచుగా ఆలోచించే వాడినని రాజమౌళి తెలిపారు.