చాలా కాలంగా హీరో మంచు మనోజ్ తన భార్య ప్రణతితో కలిసి లేరని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలుతలెత్తడంతో ఇద్దరూ కలిసి జీవించడం లేదని గత రెండేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పైగా ప్రణతి చాలా కాలంగా అమెరికాలోనే ఉండడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. దీంతో మధ్యలో ఓసారి మంచు మనోజ్ తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసి తాము సంతోషంగానే ఉన్నామని, అనవసరమైన రూమర్స్ ప్రచారం చేయొద్దని ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు.

ఆ తరువాత వార్తలు కంటిన్యూ అయ్యాయి. దీంతో మంచు మనోజ్ సైలెంట్ అయిపోయాడు. చాలా కాలంగా వీరి రిలేషన్ పై క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈరోజు మీకో ముఖ్యమైన విషయం చెబుతానని టైం కూడా చెప్పిన మంచు మనోజ్ తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చాడు.

 

తన పెళ్లి డివోర్స్ తో ముగుస్తుందని ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇద్దరికి ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉందని కానీ కలిసి జీవించలేమని తేల్చేశాడు. తన మనసు సరిగ్గా లేకపోవడం వలనే ఇన్నాళ్లు పని మీద శ్రద్ధ పెట్టలేకపోయానని చెప్పారు. ఈ బాధలో తన కుటుంబం వెన్నంటే ఉందని.. ఇకపై తన బాధను పక్కన పెట్టి సినిమాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు మనోజ్ కి మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. ధైర్యంగా ఉండాలని.. జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయని, త్వరలోనే మిమ్మల్ని  వెండితెరపై చూడాలనుకుంటున్నామని కామెంట్స్ పెడుతున్నారు. తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రణతిని చాలా కాలం పాటు ప్రేమించి 2015లో పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ల నుండే వీరిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారు. ఫైనల్ గా విడాకులతో తమ బంధానికి స్వస్తి చెప్పారు. 

 

 

ఆకాశ వీధిలో అందాల జాబిలి.. మహానటి కీర్తి రేర్ పిక్స్!