ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబుకి మధ్య ఎలాంటి గొడవల్లేవని ప్రముఖ నటి మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ తెలిపారు. కొత్త ఏడాదిలో మొదటి నెల పూర్తయిన సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో జనవరి నెలలో తాను సంతోషానికి గురైన సంగతుల గురించి చెప్పుకొచ్చారు.

ఇందులో భాగంగా 'మా' డైరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోహన్ బాబు, చిరంజీవిని ఆలింగనం చేసుకున్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఏడాదిలో మొదటి నెల పూర్తయిందని.. కొత్త దశాబ్దం, కొత్త ఏడాది.. నాన్న, చిరు అంకుల్ ఆలింగనం చేసుకున్న ఫోటోలతో అధ్బుతంగా ప్రారంభమైందని చెప్పారు.

మెగా డాటర్ హాట్ ఫోటో.. బాలీవుడ్ బ్యూటీతో పోలుస్తూ..!

ఇంటర్నెట్ లో ఆ ఫోటోలు ఒక్కసారిగా చక్కర్లు కొట్టాయని.. అసలు అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని.. కానీ ఆ ఫోటోలు చూడగానే ఎంతో సంతోషంగా అనిపించిందని చెప్పారు. వీరిద్దరి మధ్య గొడవలున్నాయంటూ.. చాలా మంది అనుకుంటున్న తరుణంలో ఈ ఏడాది ప్రేమాభిమానాల మధ్య మొదలు కావడం బాగుందని చెప్పారు.

వారాంతాల్లో వాళ్లు మా ఇంటికి, మేము వాళ్లింటికి వెళ్తుండేవాళ్లమని చెప్పుకొచ్చింది. నాన్న, చిరు అంకుల్ ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించేవారని.. అలాగే ఆ షూటింగ్ లు ఎక్కువగా ఊటీలో చిత్రీకరించడం వలన మా రెండు కుటుంబాలు వేసవి సెలవులను అక్కడే ఎంజాయ్ చేసేవాళ్లమని చెప్పుకొచ్చింది.

ఒకవేళ వాళ్ల మధ్య గొడవలు ఉండి ఉంటే కలిసి అన్ని సినిమాల్లో నటించేవాళ్లు కాదని మంచు లక్ష్మీ తెలిపింది. వారిద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదని తెలిపారు.