కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. యాంకర్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇప్పుడు ఆమె కూతురు కూడా మంచి లక్ష్మీ బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

ఆమె గారాల పట్టి విద్యా నిర్వాణ తల్లితో కలిసి ఈ మధ్యే యూట్యూబ్ లో అడుగుపెట్టింది. 'చిట్టి చిలకమ్మా' అంటూ ప్రేక్షకులను పలకరించింది. ఇక తాజాగా ఈ చిన్నారి మహాశివరాత్రిని పురస్కరించుకొని తొలిసారిగా పాట పాడింది. తొలి పాటనే ఎంతో అనుభవం ఉన్నట్లు పాడింది.

హీరోయిన్ కి తీసిపోని ఫేస్.. కానీ చేసిది ఫ్రెండ్ రోల్స్.. అందుకే సోషల్ మీడియాలో హాట్ ఫోజులు!

తన ముద్దుముద్దు మాటలతో పాట పాడుతూ ఆకర్షిస్తోంది. 'అయిగిరి నందిని' అంటూ ఉగ్రంగా పాడుతూ కనిపించింది. ఈ పాట పాడుతూ ఎన్నో వేరియేషన్స్ కనబరిచింది. ఇలా పాటకు తగ్గట్లుగా హావభావాలు ఒలికించిన తీరు చూస్తుంటే నిర్వాణ తప్పకుండా గొప్ప సింగర్ అవుతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

కొన్నిచోట్ల పదాలు పలకడానికి ఇబ్బంది పడినా ఓవరాల్ గా మెప్పించింది. ఈ వీడియోలో మంచు లక్ష్మీతో పాటు మంచు మనోజ్ కూడా కనిపించారు.