హైదరాబాద్ లో ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్న గోకుల్ థియేటర్ లో సినిమా చూస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.

శుక్రవారం నాడు 'జాను' సినిమా విడుదల కావడంతో మ్యాట్నీ షో చూడడానికి ఓ వ్యక్తి థియేటర్ కి వచ్చాడు. సినిమా అయిపోయిన తరువాత ఆడియన్స్ అందరూ వెళ్లిపోయారు. కానీ ఆ వ్యక్తి మాత్రం సీట్లో నుండి లేవకపోవడాన్ని గమనించిన థియేటర్ సిబ్బంది అతడి దగ్గరకు వెళ్లి లేపడానికి ప్రయత్నించారు.

జాను మూవీ పబ్లిక్ టాక్ : అందరికీ నచ్చకపోవచ్చు...స్లోగా ఉంది మూవీ

అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. థియేటర్ కి వచ్చిన ఎస్ఐ మహేందర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ మార్చురీకి తరలించారు.

అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు. గుండెపోటుతో మృతి చెందాడా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.