21 ఏళ్ల కుర్ర భామ మాళవిక శర్మ.. రవితేజ సరసన నేలటికెట్టు చిత్రంలో నటించింది. ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. డెబ్యూ చిత్రమే పరాజయం చెందితే హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. కానీ మాళవిక శర్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఎందుకంటే కుర్రకారుని కట్టిపడేసే అందం ఈ భామ సొంతం. 

సోషల్ మీడియాలో మాళవిక యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తోంది. ప్రస్తుతం మాళవిక శర్మ హీరో రామ్ సరసన రెడ్ చిత్రంలో నటిస్తోంది. సాధారణంగా హీరోయిన్లు సినిమాలు చేయడం మొదలు పెడితే చదువుని పక్కన పెట్టేస్తారు. కానీ మాళవిక మాత్రం ఎడ్యుకేషన్ ని నెగ్లెట్ చేయడం లేదు. 

పోసానితో తిట్టించారు, అంతు చూస్తా అన్నారు.. ఆయన లేకుంటే ఆత్మహత్య చేసుకునే వాడిని!

ఓ వైపు హీరోయిన్ గా షూటింగ్ లో పాల్గొంటూనే ఖాళీ సమయంలో లా చదువుతోంది. లాయర్ కావాలనేది ఆమె కోరిక. అందుకే బిజీగా ఉన్నప్పటికీ లా చదువుని కొనసాగిస్తోంది. ప్రస్తుతం మాళవిక లా ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఫైనల్ ఇయర్ లో సీనియర్ లాయర్ వద్ద ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మాళవిక ప్రస్తుతం రెగ్యులర్ గా నాంపల్లి లోని క్రిమినల్ కోర్టుకు వెళుతోంది. 

త్వరలోనే పరీక్షలు కూడా ఉన్నాయని అవి పూర్తి కాగానే తాను లాయర్ ని అవుతానని మాళవిక ధీమా వ్యక్తం చేస్తోంది. 

నా పెళ్ళికి స్వయంవరం ఏర్పాటు చేస్తే ఆ ముగ్గురు హీరోలని పిలుస్తా: తమన్నా